NTV Telugu Site icon

Divya – Arnav: కొత్త ట్విస్ట్.. మరో వ్యక్తితో దివ్య గర్భం.. భర్త రివర్స్ ఎటాక్

Arnav On Divya Sridhar

Arnav On Divya Sridhar

Arnav Reveals Shocking Secrets About Divya Sridhar: తన భర్త ఆర్నావ్ మరో నటితో రాసలీలలు నడుపుతున్నాడని.. తనకు, తన బిడ్డకు భర్త నుంచి ప్రాణహాని ఉందని నటి దివ్య శ్రీధర్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే! అయితే.. ఇప్పుడు ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దివ్య చెప్తున్నవన్నీ అబద్ధాలేనని.. తనకు తెలియకుండా, మరో వ్యక్తితో కలిసి గర్భం తీసుకునే ప్రయత్నం చేస్తోందని అతడు సాక్ష్యాలతో సహా ముందుకొచ్చాడు.

అసలేం జరిగిందంటే.. కర్ణాటకకు చెందిన దివ్య శ్రీధర్(35)కు 2012లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. అయితే.. భర్తతో మనస్పర్థలు రావడం వల్ల, అతనితో విడాకులు తీసుకుంది. కట్ చేస్తే.. సీరియల్స్‌లో నటిస్తున్న క్రమంలో దివ్యకు సహనటుడు ఆర్నావ్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో.. ఈ ఏడాది జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే.. ఆమెకు అంతకుముందే పెళ్లై, ఒక పాప కూడా ఉందన్న విషయం ఆర్నావ్‌కు ఇటీవల తెలిసింది. దీంతో ఈ విషయం ఎందుకు దాచావంటూ అతడు భార్యతో గొడవపడ్డాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే దివ్య తమ పెళ్లి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటిని తొలగించమని ఆర్నావ్ ఆమెపై ఒత్తిడి చేశాడు. కానీ.. దివ్య అందుకు ఒప్పుకోలేదు.

ఇంతలో.. తన భర్త మరో నటితో సంబంధం పెట్టుకున్నాడని కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. ఆ నటిని నిలదీసేందుకు షూటింగ్ స్పాట్‌కి వెళ్తే, ఆమె బాటిల్‌తో కొట్టిందని, భర్త కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని చెప్పింది. అయితే.. ఆమె చెప్తున్నవన్నీ అవాస్తవాలేనని, తాను ఆమెని చిత్రహింసలకు గురి చేయడం కాదు కదా, కనీసం టచ్ కూడా చేయలేదన్నాడు. ఇంకా దివ్యనే తన మీద దాడి చేసిందంటూ.. తనకు గాయమైన ఫోటోని రివీల్ చేశాడు. తమ పెళ్లికి సంబంధించిన పోస్టుల్ని మాత్రమే డిలీట్ చేయమన్నానని, కుటుంబ సభ్యుల అంగీకారం వచ్చాక పోస్ట్ చేయమని చెప్పానన్నాడు. కానీ, అంతకుముందే ఆమె పోస్ట్ చేయడంతో తాను మాట్లాడ్డం మానేశానని, అప్పట్నుంచి ద్వేషం పెంచుకొని.. నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పి, ఇలా డ్రామాలు ఆడుతోందని బాంబ్ పేల్చాడు.

Show comments