Covid Cases In India: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల క్రితం కేవలం పదుల్లో ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 760 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది.
Read Also: Arvind Kejriwal: బీజేపీ నన్ను అరెస్ట్ చేయాలనుకుంటోంది.. లిక్కర్ స్కామ్‌పై కేజ్రీవాల్ సంచలనం..
గడిచిన 24 గంటల్లో కేరళ, కర్ణాటకలో ఒక్కొక్కరి చొప్పున ఇద్దరు మరణించారు. డిసెంబర్ 5 వరకు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కేవలం డబుల్ డిజిట్స్‌కే పరిమితమై ఉండేది, అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, చలి వాతావరణం కారణంగా దేశంలో కోవిడ్ కేసులు పెరిగాయి.
దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కోట్ల మందికి కోవిడ్-19 సోకింది. వీరిలో 5.3 లక్షల మందికి పైగా మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. రికవరీ రేటు దేశంలో 98.81 శాతం ఉందని, ఇప్పటి వరకు దేశంలో 220.67 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు కేంద్రం తెలిపింది.