Site icon NTV Telugu

Pregnant Woman: మహరాష్ట్ర ఆస్పత్రిలో దారుణం.. గర్భిణీ పొత్తికడుపుపై యాసిడ్..

Pregnent

Pregnent

Pregnant Woman: మహారాష్ట్రలోని జల్నా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీ పొత్తికడుపుపై యాసిడ్ అప్లై చేశారు. ప్రసవ సమయంలో మెడికల్ జెల్లీకి బదులుగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రుద్దారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై శనివారం అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.

Read Also: Parag Jain: ‘‘రా’’ కొత్త చీఫ్‌గా పరాగ్ జైన్.. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర..

శుక్రవారం భోకర్దాన్ లోని ప్రభుత్వం గ్రామీణ ఆస్పత్రిలో జరిగిన ఈ సంఘటనతో మహిళకు కాలిన గాయాలయ్యాయి. ఖపర్ఖేడ గ్రామానికి చెందిన షీలా భలేరావు ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు, ఒక నర్సు ప్రసవ సమయంలో ఉపయోగించే మెడికల్ జెల్లీకి బదులుగా పొరపాటున హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసిందని అధికారులు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది చెబుతున్న దాని ప్రకారం, ఒక పారిశుద్ధ్య కార్మికుడు యాసిడ్‌ని పొరపాటున ట్రేలో ఉంచినట్లు తేలింది. జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్ ఎస్ పాటిల్ మాట్లాడుతూ, “ఇది తీవ్రమైన నిర్లక్ష్యం. వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించాము, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని అన్నారు.

Exit mobile version