Site icon NTV Telugu

Kangana Ranaut: పాకిస్తాన్తో కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయి.. ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తుంది

Kangana

Kangana

Kangana Ranaut: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ పార్టీ బ్రిటిష్ వలసవాద వారసత్వం, గతంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు ఆ పార్టీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయి.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఆశాంతి, భయానక వాతావరణం ఉండేదని తెలిపింది. ఇక, అటల్ జీ (అటల్ బిహారీ వాజ్‌పేయి) చాలా కష్టంతో ప్రభుత్వాన్ని నడిపించారు.. అటల్ జీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సమయంలో ఈ కాంగ్రెస్ కు చెందిన వారు పార్లమెంటుపై దాడికి కుట్ర చేశారని కంగనా రనౌత్ పేర్కొంది

Read Also: Kavya Thapar : తిరిగి ఫామ్ లోకి వచ్చిన హాట్ బ్యూటీ..

అయితే, కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు నెలకు రూ. 8,000 ఇస్తామన్నారు. ఏడాదికి 50 వేల రూపాయలు ఇస్తామని అబద్ధాపు హామీలు ఇచ్చారని పేర్కొనింది. అలాగే, వక్ఫ్ సవరణ బిల్లు ప్రయోజనాలను పార్లమెంట్ లో అమిత్ షా వివరిస్తున్నప్పుడు.. ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు గొడవ చేసి, సభలో తీవ్ర అంతరాయం సృష్టించారని చెప్పుకొచ్చింది. కాగా, చట్టంలోని నిబంధనల ప్రకారం.. అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు వక్ఫ్ ఆస్తుల రికార్డులను డిజిటలైజ్ చేసి, వాటిని కేంద్రీకృత పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇక, కొత్తగా నియమించబడిన వక్ఫ్ ట్రిబ్యునళ్ల ద్వారా భూ వివాదాలను పరిష్కరించడానికి కాలపరిమితి కలిగిన కమిటీలను ఏర్పాటు చేసుకునే హక్కు ఈ చట్టంలో ఉందని ఎంపీ కంగనా రనౌత్ వెల్లడించింది.

Exit mobile version