NTV Telugu Site icon

RG Kar ex-principal: ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్కి సీబీఐ కోర్టు షాక్.. నేరం రుజువైతే మరణశిక్షే..?

Cbi

Cbi

RG Kar ex-principal:కోల్‌కతా ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి సీబీఐ స్పెషల్ కోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. సందీప్ ఘోష్ కి బెయిల్‌ నిరాకరించడంతో పాటు నేరం రుజువైతే మరణశిక్ష తప్పదని అడిషనల్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎస్‌ డే వెల్లడించింది. సాక్ష్యాధారాలు తారుమారు చేశారనే ఆరోపణలు ఎదుర్కోంటున్న.. మాజీ ప్రిన్సిపల్, తలా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్ అభిజిత్‌ మెండల్‌ సీబీఐ కస్టడీలో ఉన్నారు. వీరు బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిల్ దాఖలు చేయగా.. ఘోష్ ని కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు లాయర్ వాదించారు. కాగా, కోర్టు మాత్రం బెయిల్ అభ్యర్థనని తోసిపుచ్చింది. సందీప్‌ ఘోష్‌పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.. ఈ కేసులో ఆయన్ను బెయిల్‌పై రిలీజ్ చేయడం వీలు కాదు తేల్చి చెప్పింది.

Read Also: Fire Accident: మేడ్చల్ మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం.. బైక్ చార్జింగ్ పెట్టడంతో మంటలు..

అలాగే.. అభిజిత్‌ మెండల్ బెయిల్‌ పిటిషన్‌ను సైతం సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఇక, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. నిందితులను మరోసారి కస్టడీ కోరింది. దీంతో సెప్టెంబర్‌ 30న కస్టడీకి ప్రత్యేక కోర్టు పర్మిషనల్ ఇచ్చింది. ఆగష్టు 9న ఆర్జీ కర్‌ ఆస్పత్రి సెమినార్‌ హాల్‌లో ట్రైనీ డాక్టర్ పై హత్యచారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు తారుమారుచేసేందుకు ట్రై చేశారని సందీప్ పై ఆరోపణలు చేశారు. అలాగే, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో జాప్యం చేశారని తలా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి అభిజిత్‌ మెండల్‌పైనా కూడా సీబీఐ కేసు ఫైల్ చేసింది.