Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhinandan Varthaman: భారత వైమానిక దళ మాజీ గ్రూప్ కెప్టెన్, వీర చక్ర పురస్కార గ్రహీత అభినందన్ వర్ధమాన్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత వాయుసేనలో సేవలందించిన ఆయన తాజాగా వైమానిక దళానికి వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గోవా కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ ప్రాంతీయ విమానయాన సంస్థ FLY91లో కమర్షియల్ పైలట్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అభినందన్ వర్ధమాన్ ఆగస్టులో FLY91లో పైలట్‌గా చేరినట్లు సమాచారం. అయితే ఆయనకు సంస్థలో అప్పగించిన నిర్దిష్ట బాధ్యతలు, ఇతర వివరాలను ఎయిర్‌లైన్ వెల్లడించలేదు. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం గోప్యమైన అంశమని పేర్కొంటూ FLY91 ప్రతినిధులు ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
పాక్ F-16ను కూల్చిన అభినందన్
2019లో భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగిన వైమానిక ఘర్షణతో అభినందన్ వర్ధమాన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తన మిగ్-21 బైసన్‌తో కూల్చివేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఘటనలో అభినందన్ నడిపిన యుద్ధ విమానం కూడా కూలిపోయింది. అనంతరం ఆయన పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి సైన్యానికి చిక్కారు. దాదాపు మూడు రోజుల పాటు పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న ఆయనను పాక్ అధికారులు అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో భారత్‌కు అప్పగించారు.
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
వీర చక్రతో గౌరవం
అభినందన్ చూపిన ధైర్యసాహసాలకు కేంద్ర ప్రభుత్వం 2021లో దేశంలోని మూడో అత్యున్నత యుద్ధ శౌర్య పురస్కారమైన ‘వీర చక్ర’తో సత్కరించింది. వైమానిక పోరాట సమయంలో విధి పట్ల అసాధారణ అంకితభావం, ధైర్యాన్ని ప్రదర్శించినందుకు ఆయనకు ఈ పురస్కారం అందించారు. అభినందన్ వర్ధమాన్ తండ్రి ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్ కూడా భారత వైమానిక దళంలో సేవలందించారు. దీంతో వర్ధమాన్ కుటుంబానికి భారత రక్షణ రంగంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇక ఆయన తాజాగా IAFకు గుడ్‌బై చెప్పి గోవా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న FLY91 ప్రాంతీయ విమానయాన సంస్థలో చేరినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ 2024 మార్చిలో తన విమాన సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద ATR 72-600 రకం ఆరు విమానాలు ఉన్నట్లు సమాచారం. గోవాతో పాటు హైదరాబాద్‌లోనూ ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఫైటర్ పైలట్‌గా దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన అభినందన్.. ఇప్పుడు కమర్షియల్ పైలట్‌గా కొత్త బాధ్యతలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. యుద్ధ విమానం నుంచి ప్రయాణికుల విమానం వరకు ఆయన కెరీర్లో ఇది మరో కీలక అధ్యాయంగా నిలవనుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?