CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?

  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతించిన సీజేపీ.
  • "విద్యార్థి శక్తి వర్ధిల్లాలి" అంటూ ఎక్స్‌లో పోస్టు.
  • "సుభా హో గయీ మామూ" అంటూ మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు.
  • ప్రధాన్ రాజీనామా తొలి వికెట్ మాత్రమేనన్న సీజేపీ అధినేత.
Abhijeet Dipke

Abhijeet Dipke

CJP:  నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వారు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవద్దని, హింసకు అవకాశం ఉండొద్దనే ఉద్దేశ్యంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వద్దనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తానెప్పుడు బాధ్యతల నుంచి పారిపోలేదని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే, ప్రధాన్ రాజీనామాతో గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సంతోషం వ్యక్తం చేసింది. విద్యార్థి శక్తి వర్ధిల్లాలి అంటూ ట్వీట్ చేసింది. అయితే, రాజీనామా తర్వాత సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మున్నాబాయి ఎంబీబీఎస్ సినిమాలోని ‘‘ సుభా హోగయి మామూ( ఉదయమైంది మామా)’’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది తొలి వికెట్’’ మాత్రమే అని అన్నారు. ఇది ప్రారంభం మాత్రమే అని హెచ్చరించారు. దీనిని బట్టి చూస్తే ఇది ఒక్క రాజీనామాతో ఆగేది కాదని స్పష్టమవుతోంది.