Site icon NTV Telugu

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ని జైలులో చంపేందుకు కుట్ర.. సంజయ్ సింగ్ ఆరోపణలు..

Arvind Kejriwal Case

Arvind Kejriwal Case

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ని చంపేందుకు కుట్ర జరగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి బీజేపీ పట్టించుకోవడం లేదని అన్నారు. కేజ్రీవాల్‌కి ఎప్పుడైనా ఏదైనా జరుగొచ్చని వైద్య నివేదికలు చెబుతున్నాయని ఆయన అన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంతో బీజేపీ చెలగాటమాడుతోందని, మొదట్లో స్వీట్లు తినిపించి షుగర్ లెవల్స్ పెంచే ప్రయత్నం చేశారని, ఇప్పుడు తిండి తగ్గించేశారని చెబుతున్నారని, ఎవరైనా ఎందుకు ఇలా చేసి తమకు ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటారని సంజయ్ సింగ్ ప్రశ్నించారు.

Read Also: Paris Olympics 2024 : బీసీసీఐ కీలక ప్రకటన..భారతీయ అథ్లెట్లకు 8.5 కోట్ల సాయం

ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇటీవల కేజ్రీవాల్ తనకు తాను ఉద్దేశపూర్వకంగా అనారోగ్యానికి గురవుతున్నాడని చెప్పారు. తమ నాయకుడిని చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సూచించిన వైద్య ఆహారం, మందులు వినియోగించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన లెఫ్టినెంట్ గవర్నర్, దీని వెనక కారణాలను విశ్లేషించాలని అధికారుల్ని కోరారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు సూపరింటెండెంట్ నివేదికను ఉటంకిస్తూ.. ఇంట్లో వండిన ఆహారాన్ని తగినంతగా అందించినప్పటికీ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా తక్కువ కేలరీలను తీసుకోవడాన్ని ప్రస్తావించారు.

Exit mobile version