NTV Telugu Site icon

AAP: మహారాష్ట్ర ఎన్నికలకు దూరంగా ఆప్.. మిత్రపక్షాల కోసం ప్రచారం..

Aap

Aap

AAP: మహారాష్ట్రలో వచ్చే నెల జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పోటీ చేయడం లేదని ప్రకటించింది. మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ-ఎస్పీ, ఉద్ధవ్ ఠాక్రే సేవ కోసం ప్రచారం చేస్తారని ఆ పార్టీ నే సంజయ్ సింగ్ శనివారం చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్)-ఉద్ధవ్ ఠాక్రే శివసేన ‘‘మహా వికాస్ అఘాడీ(MVA)’’ పేరుతో కూటమిగా పోటీ చేస్తున్నాయి.

Read Also: Kavya Thapar: అసిస్టెంట్ డైరెక్టర్ అలా అనేసరికి బిత్తర పోయా.. షాకింగ్ విషయం బయటపెట్టిన కావ్య

“మహారాష్ట్ర ఎన్నికల్లో, పార్టీ జాతీయ కన్వీనర్, అరవింద్ కేజ్రీవాల్, MVA అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్రలో ఎన్నికలలో పోటీ చేయదు,” అని రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. మహరాష్ట్రలో అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం కోసం ఉద్ధవ్, శరద్ పవార్ వర్గాలు సంప్రదించినట్లు ఆప్ వర్గాలు చెప్పాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రచారం చేయబోతున్నారని వారు తెలిపారు.

హర్యానాలో ఒంటరిగా పోటీ చేయడంతోనే ఆప్, కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టిందనే ప్రచారం ఉంది. దీంతోనే బీజేపీ గెలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలొద్దని ఆప్ పోటీ చేయడం లేదని తెలుస్తోంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరుగబోతున్నాయి. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.

Show comments