Site icon NTV Telugu

Delhi: బీజేపీ కార్యాలయం ఎదుట ఆప్ ఆందోళన

Atiesh

Atiesh

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. దిన్ దయాళ్ ఉపాద్యాయ మార్గ్‌లో ఉన్న కార్యాలయం ఎదుట ఆప్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం, నియంత పాలన అంతం.. కోసం అంటూ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ప్లకార్డులను ప్రదర్శించాయి. మరోవైపు బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర అనుమతి లేదంటూ ఆప్ పార్టీకి చెందిన ఆందోళనకారులను పోలీసులు నిలిపివేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: Top Upcoming Smartphones: జులైలో విడుదల కానున్న టాప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఆ పార్టీ ఇటీవల పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా ఢిల్లీ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో మంత్రి అతిషి పాల్గొన్నారు. పలువురు ఆప్ అగ్రనేతలు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో కృష్ణుడి పాత్రలో కనిపించింది సూర్య ఫ్రెండా?

Exit mobile version