Site icon NTV Telugu

AAP vs BJP: ఎల్జీ రాజీనామా చేయాలంటూ ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో ఆప్ ఎమ్మెల్యేల నిరసన

Aam Admi Party

Aam Admi Party

AAP vs BJP: లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజీనామా చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో నిరసన తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీ భవనం ఆవరణలో మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద బైఠాయించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సక్సేనా 2016లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు నోట్ల రద్దు సమయంలో రూ.1,400 కోట్ల విలువైన నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు కుంభకోణం చేశారని ఆప్ నాయకుడు అతిషి ఆరోపించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని కోరుతున్నామని అతిషి చెప్పారు.

Reliance Industries: రిలయన్స్‌లో కొత్త నాయకత్వం.. ఆయిల్ అనంత్‌కు, రిటైల్ ఇషాకు..!!

ఢిల్లీ ఎల్‌జీ పదవి నుంచి సక్సేనాను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం 2022 ప్రకారం దీనిని పరిశీలించాలని సూచించారు. సీబీఐ, ఈడీ సక్సేనా గతంలో పనిచేసిన ప్రతి స్థలంపై కూడా దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయనను పదవి నుంచి తొలగించాలని ఆప్ నేత కోరారు. ఆప్ ఎమ్మెల్యేలు పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ, ఎల్‌జీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకున్నారు.

Exit mobile version