Site icon NTV Telugu

AAP Leader Climbs Tower: టికెట్ ఇవ్వలేదని టవర్ ఎక్కిన ఆప్ నేత

Aap Leader Climbs Tower

Aap Leader Climbs Tower

AAP Leader, Denied Delhi Civic Poll Chance, Climbs Tower: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం ఆప్ తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 250 సభ్యులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీని కోసం ఆప్ శుక్రవారం 134 మందితో, శనివారం 117 మందితో తుది జాబితాను విడుదల చేసింది. అయితే అందులో తన పేరు లేకపోవడంతో ఆప్ నేత టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.

Read Also: Gujarat: రైలు లేకపోతే ఓట్లు లేవు.. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన 18 గ్రామాలు

వివరాల్లోకి వెళితే.. తూర్పు ఢిల్లీకి చెందిన మాజీ కౌన్సిలర్ హసీబ్-ఉల్ హసన్ తనకు టికెట్ రాకపోవడంతో నిరసన తెలుపుతూ.. టవర్ ఎక్కాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆప్ వర్గాల్లో కలకలం రేపింది. టవర్ ఎక్కడమే కాకుండా దాన్ని ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాడు. తనకు టికెట్ రాకపోవడానికి ఆప్ నాయకులు అతిషి, దుర్గేష్ పాఠక్ కారణం అని ఆరోపించారు. తాను చనిపోతే వీరిద్దరిదే బాధ్యత అని చెప్పాడు. ‘‘ ఈ రోజు నాకు ఏదైనా జరిగితే లేదా నేను చనిపోతే ఆప్ నాయకులు దుర్గేష్ పాఠక్, అతిషి బాధ్యత వహిస్తారని అన్నాుడ. నా బ్యాంక్ పాస్ బుక్ తో సహా నా ఒరిజినల్ పత్రాలు వారి వద్ద ఉన్నాయి.. నామిణేషన్ల దాఖలు చేయడానికి రేపు చివరి రోజు కానీ వారు నాపత్రాలను నాకు ఇవ్వడం లేదు’’ అని వీడియో చెప్పాడు.

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తనను పోటీలో దింపుతుందా.. లేదా.. అన్నది తనకు ఆందోళనగా లేదని.. అయితే తన పత్రాలను తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ ఆరోపణలపై ఆప్ స్పందించలేదు. హసీబ్ ఉల్ హసన్ ఈ ఏడాది ప్రారంభంలో వార్తల్లోకి వచ్చారు. మార్చి నెలలో శాస్త్రి పార్క్ లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. తెల్లని కుర్తాతో డ్రెయిన్ లో నిలబడి చెత్త తీస్తూ నిరసన తెలిపారు.

Exit mobile version