NTV Telugu Site icon

MP Sanjay Singh: ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసాన్ని వారంలో ఖాళీ చేయనున్న కేజ్రీవాల్..

Kejriwa

Kejriwa

MP Sanjay Singh: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని వారం రోజుల్లో ఖాళీ చేస్తారని.. ప్రభుత్వ సౌకర్యాలన్నింటినీ వదులుకుంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈరోజు (బుధవారం) తెలిపారు. తన అధికారిక నివాసాన్ని విడిచిపెట్టిన తర్వాత కేజ్రీవాల్, అతని కుటుంబం ఢిల్లీలోనే ఉంటారని చెప్పుకొచ్చారు. వారికి తగిన వసతి కోసం అన్వేషణ జరుగుతోందని ఆప్ ఎంపీ చెప్పుకొచ్చారు. ఇక, మేము కేజ్రీవాల్ భద్రత గురించి ఆందోళన చెందుతున్నాము.. భద్రతా కోణంలో ఇప్పుడు ఉన్న ఇల్లు ముఖ్యమైంది.. కానీ అతను దానిని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నాడు.. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలతో కలిసి జీవిస్తాడని ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ పేర్కొన్నారు.

Read Also: MSME Policy: ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యాంశాలు ఇవే..

ఇక, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు అని ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అవినీతిపరుడని, ఆయన నిజాయితీని ప్రశ్నిస్తూ గత రెండేళ్లుగా బీజేపీ పరువు తీసేందుకు ప్రయత్నిస్తోంది మండిపడ్డారు. బెయిల్ పొందడం దాదాపు అసాధ్యమైన సందర్భంలో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అన్నారు. కాగా, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మాజీ అధికారి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్యం పాలసీ స్కామ్‌తో సంబంధం ఉన్న కేసులో ఈ నెల ప్రారంభంలో అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబరు 17న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే, ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీలో అధికారం దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తుంది.

Show comments