NTV Telugu Site icon

Shraddha Walkar Case: 20 మంది హిందూ యువతులతో సంబంధం.. ఉరివేసినా “జన్నత్” లభిస్తుందంటూ అఫ్తాబ్ వెల్లడి..

Shraddha Walkar Case

Shraddha Walkar Case

Aaftab Poonawala Confessed In Polygraph Test, No Remorse: శ్రద్ధా వాకర్ హత్యలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలకు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో అఫ్తాబ్ పూనావాలా కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. శద్ధావాకర్‌ని హత్య చేసినందుకు పశ్చాత్తాప పడటం లేదని పోలీసులు నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఉరి శిక్ష వేసినా నాకు జన్నత్ ( స్వర్గం) లభిస్తుందని, తనను హీరోగా గుర్తుంచుకుంటారని పాలిగ్రాఫ్ టెస్టులో చెప్పినట్లు సమాచారం. శ్రద్ధాతో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే 20 మంది హిందూ యువతులతో అఫ్తాబ్ అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు అంగీకరించారు.

బంబుల్ యాప్ ఉపయోగించి ముఖ్యంగా హిందూ అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకుని తన ట్రాపులో పడేసే వాడినని అఫ్తాబ్ వెల్లడించాడు. శ్రద్ధ హత్య తర్వాత ఓ సైకాలజిస్టులో డేటింగ్ మొదలు పెట్టాడు. తనూ కూడా ఓ హిందూ మహిళే అని.. ఆమెను సంబంధంలోకి దింపేందుకు శ్రద్ధాకు చెందిన ఓ ఉంగరాన్ని కూడా గిఫ్టుగా ఇచ్చినట్లు అంగీకరించినట్లు సమాచారం. అనేక మంది హిందూ అమ్మాయిలతో టచ్ లో ఉండే వాడని తెలుస్తోంది. శ్రద్ధాను చంపిన తర్వాత శరీరాన్ని 35 ముక్కలుగా చేసిన తర్వాత తనకు బాధ అనిపించలేదని.. ముంబైలోనే శ్రద్ధాను హత్య చేద్దాం అని ప్లాన్ వేసినట్లు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు.

Read Also: Mumbai: సవతి కూతురుపై అత్యాచారం.. డీఏన్ఏ పరీక్ష ఆధారంగా కోర్టు తీర్పు..

పాలిగ్రాఫ్ టెస్టులో శ్రద్ధా వాకర్ ను తానే హత్య చేసినట్లు అఫ్తాబ్ అంగీకరించాడు. ఢిల్లీ న్యాయస్థానం అనుమతితో ఇప్పటికే అఫ్తాబ్ కు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించారు. మరోసారి డిసెంబర్ 1,5 తేదీల్లో మళ్లీ నార్కో పరీక్షలు చేయనున్నారు. ఢిల్లీలోని రోహిణిలోని ఫొరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)లో నార్కో టెస్టులు చేయనున్నారు. నార్కో అనాలిసిస్ టెస్టులను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. థర్డ్ డిగ్రీ ఉపయోగించవద్దని హెచ్చరించింది.

మే 18న లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధా వాకర్‌ని అఫ్తాబ్ దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఢిల్లీ మోహ్రౌలి సమీపంలోని ఛత్తార్ పూర్ ప్రాంతంలో శరీర భాగాలను పడేశాడు. శ్రద్ధ తండ్రి ఫిర్యాదుతో నవంబర్ 14న ఈ భయంకరమై కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే శ్రద్ధాకు చెందిన ఎముకలు, రక్తపు నమూనాలను సేకరించిన పోలీసులు డీఎన్ఏ పరీక్ష కోసం పంపారు. ఫలితాలు రావాల్సి ఉంది. నిందితుడిని అరెస్టు చేసి, ఐపిసి సెక్షన్ 302 (హత్య) , 201 (చేసిన నేరానికి సంబంధించిన ఆధారాలు అదృశ్యం కావడం) కింద కేసు నమోదు చేశారు.

Show comments