Belagavi: మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని బెలగావి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన (యూబీటి) నేత ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇది చిన్న పిల్లల ప్రకటనలా ఉందన్నారు. మాకు మహాజన్ నివేదికే ఫైనల్.. ఆ నివేదికను ఆమోదించిన తర్వాత ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. బెల్గాంను కేంద్ర పాలిత ప్రాంతంగా ఎలా ప్రకటిస్తారు? అని ప్రశ్నించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ఏకీకరణ సమితి నిరసన చేస్తే.. మేము చూస్తూ ఊరుకోమని కన్నడ సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు.
Read Also: Manipur Violence: 23 రోజుల తర్వాత మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు పునఃప్రారంభం
ఇక, బెలగావిలో మరాఠీ మాట్లాడే ప్రజలకు అన్యాయం జరుగుతోందని.. ఆ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన (యూబీటీ) ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు. అయితే, సోమవారం నుంచి కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగానే.. బెలగావిలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి సభ్యులు ఒక సభను ఏర్పాటు చేశారు. కానీ, కర్ణాటక ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిషేధించడంతో పాటు మహారాష్ట్రలోని నాయకులను రాష్ట్రంలోకి రాకుండా నిషేధించింది.
Read Also: India- Bangladesh: భారత్తో సంబంధాలు బలంగానే ఉన్నాయి.. హసీనా వ్యాఖ్యలపై యూనస్ ఆందోళన
అయితే, బెలగావి సరిహద్దు సమస్య 1957లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించినప్పటి నుంచి ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో భాగమైన 800 కంటే ఎక్కువ మరాఠీ మాట్లాడే సరిహద్దు గ్రామాలను కలిగి ఉంది. ఇది, గతంలో బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావిపై మహారాష్ట్ర పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1967 మహాజన్ కమిషన్ నివేదిక ప్రకారం భాషా ప్రాతిపదికన చేసిన విభజన అంతిమమని కర్ణాటక సర్కార్ పేర్కొంది. బెలగావి రాష్ట్రంలో అంతర్భాగమని చెప్పడానికి.. కర్ణాటక ప్రభుత్వం ఇక్కడ ‘సువర్ణ విధాన సౌధ’ని నిర్మించింది, ఇది బెంగళూరులోని రాష్ట్ర శాసనసభ, సచివాలయ కేంద్రమైన విధాన సౌధ నమూనాలో నిర్మించింది.