NTV Telugu Site icon

Aadhaar: ఆధార్ వల్ల వ్యక్తిగత భద్రతకు ముప్పు.. కేంద్రం ఏం చెబుతోంది?

Untitled 10

Untitled 10

Aadhaar: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడికి వెళ్లిన ఏ పని చెయ్యాలన్న చివరికి ఉద్యోగాలు చేసుకుంటూ హాస్టల్ లో ఉండాలి అనుకున్న ముందు ఆధార్ సబ్మిట్ చెయ్యాలి. ఇక ప్రభుత్వ పథకాల విషయంలో ఆధార్ తప్పనిసరి. అయితే ఈ ఆధార్ వల్ల వ్యక్తి యొక్క వ్యక్తిగత భద్రతకు ముప్పు పొంచి ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఆరోపించింది.

Read also:Rohit-Ritika Hug: రోహిత్‌ శర్మ హగ్ ఇచ్చినా.. బుంగమూతి పెట్టిన రితిక! వీడియో వైరల్

వివరాలలోకి వెళ్తే.. రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తాజాగా డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అండ్ డిజిటల్ అసెట్స్ పేరుతో ఆధార్ పై రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఆధార్ వినియోగం సరైనది కాదని, దీని వినియోగం వల్ల ఒక వ్యక్తి గోప్యంగా ఉంచుకునే విషయాలు కూడా బయటకి వస్తున్నాయని.. వ్యక్తిగత విషయాలకు భద్రత లేదని.. బయోమెట్రిక్ సరిగా రాక చాలా మంది సేవలు పొందలేక పోతున్నారని ఆరోపించింది. ఆధార్ తో పౌరుల సున్నితమైన డేటా సమాచారంపై ఉల్లంఘనల ముప్పు పొంచి ఉందని మూడీస్ ఆరోపించింది. అయితే ఇవన్నీ అధరాలు లేని ఆరోపణలు అంటూ కొట్టి పారేసిన కేంద్రం ఇలా ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యొద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. బయోమెట్రిక్ అంటే కేవలం వేలిముద్ర కాదని ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ అథెంటికేషన్ వంటి కాంటాక్ట్ లెస్ మార్గాలు కూడా ఉన్నాయని తెలియచేసింది. చాల సందర్భాలలో మొబైల్ ఓటీపీని వినియోగించుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ ఆధార్. వంద కోట్లకుపైగా భారతీయులు దీన్ని విశ్వసించి వినియోగిస్తున్నారు. మూడీస్ డేటా ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి డేటా ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది.