బెంగళూరులో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి ఒక విద్యాకుసుమం రాలిపోయింది. కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా దుండగుడు కత్తితో తెగబడడంతో తీవ్ర రక్తస్రావమై విద్యార్థిని కుప్పకూలి ప్రాణాలు వదిలింది. శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ఘతుకం జరిగింది.
ఇది కూాడా చదవండి: Delhi University: ఢిల్లీ వర్సిటీలో అమానుషం.. పోలీసులు చూస్తుండగా ప్రొఫెసర్‌ను చెంపదెబ్బ కొట్టిన విద్యార్థి
హోసకెరెహళ్లి ప్రాంతంలోని ఒక కళాశాలలో యామిని ప్రియ అనే విద్యార్థిని(21) బి.ఫార్మ్ చదువుతోంది. గురువారం పరీక్ష హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా బెంగళూరులోని మల్లేశ్వరంలోని మంత్రి మాల్ వెనుక ఉన్న రైల్వే పట్టాల దగ్గర యువకుడు అడ్డగించాడు. ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే యామిని ప్రియ తుదిశ్వాస విడిచింది.
ఇది కూాడా చదవండి: Fake Honey: అలర్ట్.. హైదరాబాద్‌లో నకిలీ తేనె.. కొనుగోలు చేసే ముందు ఇలా పరీక్షించండి..!
రోడ్డు పక్కన నడుచుకుంటుూ వెళ్తున్న ప్రయాణికులకు యువతి పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీరాంపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. దుండగుడిని గుర్తించడానికి అధికారులు ఆ ప్రాంతంలోని సీసీటీవి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడంతో హత్య చేసి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ప్రియ కాల్ రికార్డ్‌లను, ఆమె వివరాలను కూడా తనిఖీ చేస్తున్నామని… కొన్ని ఆధారాలు దొరికాయని.. వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూాడా చదవండి: Earthquake: ఫిలిప్పీన్స్‌ను వదలని భూకంపాలు.. మరోసారి భారీగా ప్రకంపనలు!
