A Woman Falls Under Moving Train In Bihar Gaya: తమవైపుకు రైలు అత్యంత వేగంతో దూసుకొస్తున్నా సరే.. కొందరు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్న పొరపాటు జరిగినా తమ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా.. పట్టాలు దాటేందుకు పట్టుబడుతుంటారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతే, మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. తాజాగా ఓ మహిళ సైతం పట్టాలు దాటబోయి రైలు కింద పడిపోయింది. అయితే.. అదృష్టవశాత్తూ ఆమె స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
England Bomb Explode: వరల్డ్ వార్ 2 నాటి బాంబ్.. డిఫ్యూజ్ చేస్తుండగా భారీ పేలుడు
శుక్రవారం బిహార్‌లోని గయా ప్రాంతంలో తన్‌కుప్ప రైల్వే స్టేషన్ నుంచి ఒక గూడ్సు రైలు బయలుదేరింది. సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. తనవైపుకి రైలు దూసుకెళ్తున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టాలు దాటాలని అడుగు ముందుకేసింది. అయితే.. ఈ కంగారులో ఆమె కాలుజారి పట్టాలపై పడింది. ఇంతలో ట్రెయిన్ దూసుకురావడంతో, పట్టాల మధ్య పడుకుంది. రైలు వెళ్లిపోయేంతవరకు కదలకుండా, అలాగే ఉండిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలు అయ్యాయి. పట్టాల కింద ఆమెను గమనించిన పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని, రైలు వెళ్లాక ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Rohit Sharma- Rithika Sajdeh: రోహిత్ రికార్డు సెంచరీ.. భార్య రితిక పోస్ట్ ట్రెండింగ్
అంత అవసరం ఏమొచ్చిందని పట్టాలు దాటేందుకు ప్రయత్నించావు? అని అడిగితే.. అవతల ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ట్రైన్‌ని అందుకోవడం కోసమే తాను అలా చేశానని ఆమె సమాధానం ఇచ్చింది. ఆ రైలు ఎక్కడ వెళ్లిపోతుందన్న ఆందోళనలో, పట్టాలు దాటేందుకు ప్రయత్నించానని, కానీ ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి నెట్టింట్లో పెట్టగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది.
Gold and Silver Price: మరింత పైకి కదిలిన పసిడి ధర.. ఈ పరుగు ఆగదా..?