England Bomb Explode: వరల్డ్ వార్ 2 నాటి బాంబ్.. డిఫ్యూజ్ చేస్తుండగా భారీ పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World War II Bomb Explodes Unexpectedly In England Norfolk: ఇంగ్లండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబ్‌ను డిఫ్యూజ్ చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఇంగ్లండ్‌లోని నార్ ఫోల్క్ కౌంటీలో ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే.. ఇది పక్కా ప్లాన్‌తో చేసిన పేలుడు కాదని, ఆ బాంబ్‌ని డిఫ్యూజ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా జరిగిందని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. సాధారణంగా ఇలాంటి బాంబులను గుర్తించినప్పుడు.. అక్కడి అధికారులు పక్కా ప్లాన్ వేసుకొని వాటిని, డిఫ్యూజ్ చేస్తుంటారు. ఒకవేళ డిఫ్యూజ్ చేయడానికి వీలు పడకపోతే.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని, వాటిని పేలుస్తారు.
Turkey Earthquake: టర్కీ, సీరియాలలో భూప్రళయం.. 24 వేలు దాటిన మృతుల సంఖ్య
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
ఈ క్రమంలోనే నార్ ఫోల్క్ కౌంటీలో వరల్డ్ వార్ 2 నాటి బాంబ్ ఉందని మంగళవారం అధికారులు గుర్తించారు. దీన్ని డిఫ్యూజ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. ఇది ప్రమాదంతో కూడుకున్న పని కావడంతో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న జనాలను అక్కడి నుంచి తరలించారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. మనుషులతో కాకుండా, రోబోలతో బాంబ్‌ని డిఫ్యూజ్ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆ బాంబు పేలిపోయింది. తద్వారా అక్కడ భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసిన పోలీసులు.. ఆస్తినష్టం ఎంత జరిగిందన్న విషయంపై అంచనా వేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రమాదం లేకపోవడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే జనాలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లొచ్చని వెల్లడించారు.
INDvsAUS 1st Test: మర్ఫీకి 7 వికెట్లు.. 141 ఏళ్ల రికార్డు బద్దలు
అయితే.. విస్ఫోటనం కారణంగా భారీగా దుమ్ము, ధూళి గాల్లోకి ఎగిసిపడింది. ఈ కారణంగా.. ఆ ప్రాంతంలో కాసేపు పొగ నిండిపోయింది. శకలాలు కూడా రోడ్డు మీదకి ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నార్ ఫోల్క్ అధికారులు ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘డిఫ్యూజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా భారీ పేలుడు సంభవించింది. ఈ దృశ్యాల్ని మా డ్రోన్ కెమెరా రికార్డ్ చేసింది. అయితే.. అంతకుముందే అక్కడి నుంచి జనాల్ని తరలించడంతో, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కాకపోతే ఈ ప్రాసెస్‌కి కొంత ఎక్కువ సమయం పట్టింది’’ అంటూ ట్విటర్‌లో చెప్పుకొచ్చారు.
KTR V/s Bhatti: భట్టి పై కేటీఆర్ సెటైర్.. 9 నెలల్లో పిల్లులు వస్తారు కానీ..
The unexploded bomb in #GreatYarmouth detonated earlier during work to disarm it. Our drone captured the moment. We can confirm that no one was injured. Public safety has been at the heart of our decision making all the way through this operation, which we know has been lengthy. pic.twitter.com/9SaeYmHkrb
— Norfolk Police (@NorfolkPolice) February 10, 2023
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!