Site icon NTV Telugu

Tiger in Maharashtra: చంద్రాపూర్ జిల్లాలో నడిరోడ్డు పై గాండ్రిస్తున్న పులి..

Four Tigers In Maharashtra

Four Tigers In Maharashtra

Tiger in Maharashtra: మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని వరోర తాలూకా పరిధిలో మాజిరి గ్రామ పరిసర ప్రాంతంలోని రహదారిపై పులి సంచారం హడల్‌ ఎత్తిస్తోంది. నడిరోడ్డుపై సేదతీరుతూ గాండ్రిస్తున్న టైగర్ తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పులి వీడియో తీసిన యువకులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అవుతుంది. గ్రామస్తులు ఇక్కడ పులులు రోడ్డుమీద తిరుగుతున్నాయని ప్రయాణికులు ఇబ్బందిగా మారిందని వాపోయారు. అధికారులు స్పందించకపోతే పులి మనుషులపై పంజా విసిరే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పులులను కట్టడి చేయకపోతే ఇబ్బంది ఎదుర్కొనవలసి ఉంటుందని గ్రామస్థులు కోరుతున్నారు.

Read also: Himanshu Rao: బాలకృష్ణ డైలాగ్ వైరల్‌.. ట్విట్ చేసిన కేసీఆర్‌ మనువడు..

ఇక నిన్న (సోమవారం) ఆదిలాబాద్‌జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామం, తాంసి మండలం పిప్పలకోటి గ్రామం మధ్య రోడ్డుపై కాల్వ పనులు కొనసాగుతున్న ఏరియాలో నాలుగు పులులు కనిపించాయి. తన ట్రక్కులో ఇంధనం నింపుతున్నప్పుడు పిప్పల్‌కోటి గ్రామం వద్ద రిజర్వాయర్ సమీపంలో రోడ్డుపై కనిపించిన పులులను డ్రైవర్ వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది. 4 పులులు మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి వచ్చినట్టుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. వేట కోసం పెన్‌గంగా నదిని దాటి తరచుగా ఆదిలాబాద్‌లోకి ప్రవేశిస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. జంతువులను పర్యవేక్షించేందుకు యానిమల్ ట్రాకర్లను ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వారు తెలిపారు. పులుల కదలికలను ప్రత్యేక టీంలు మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. పులులకు హాని చేయవద్దని అన్నారు.
Ancient Ayyappa Idol: ఉప్పాడ తీరానికి కొట్టుకు వచ్చిన అయ్యప్ప విగ్రహం

Exit mobile version