NTV Telugu Site icon

Mizoram: మిజోరాంలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలోని రైల్వే బ్రిడ్జి కూలి 17 మంది మృతి

Mizoram

Mizoram

Mizoram: మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలోని రైల్వే బ్రిడ్జి కూలి 17 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన శిధిలాల కింద 30 మంది వరకు కూలీలు ఉన్నట్టు సమాచారం. మిజోరం రాష్ట్రంలో సాయిరంగ్ వ‌ద్ద ఉన్న కురంగ్ న‌దిపై బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. సాయిరంగ్ నుంచి బైరాబి మ‌ధ్య ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ ప‌నుల్లో దాదాపు 40 మంది వ‌ర్కర్లు ఉండి ఉంటార‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఇనుప బ్రిడ్జ్ కింద చిక్కుకున్న 17 మంది కార్మికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 30 మంది వ‌ర్కర్లు శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. మిజోరాం రాజధాని ఐజ్వాల్ కు 21 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 35 నుండి 40 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

Read Also: Jupalli: కేసీఆర్ మళ్లీ అధికారంలో వస్తే రాష్ట్రాన్ని అమ్మేయడం ఖాయం..! జూపల్లి కీలక వ్యాఖ్యలు

శిథిలాల కింద నుండి 17 మృతదేహలను వెలికి తీశారు. ఇంకా కొందరు కార్మికుల ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఆచూకీ లేకుండా పోయిన కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. రైల్వే ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బైరాగి-సాయిరాంగ్ కొత్త రైల్వే లైన్ కోసం వంతెన నిర్మాణం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి కుప్పకూలినట్టుగా మిజోరం సీఎం జోరంతంగా పేర్కొన్నారు. ఈ దుర్ఘటన పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో ఐజ్వాల్ ను కలిపేందుకు 51.38 కి.మీ. దూరం కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు.ఈ క్రమంలోనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.