Site icon NTV Telugu

పిటి ఉషపై పోలీస్‌ కేసు నమోదు

పరుగుల రాణి పిటి ఉషపై కేరళలోని కోజికోడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాజీ అథ్లెట్‌ జెమ్మా జోసెఫ్‌ ఫిర్యాదు మేరకు ఉషపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కోజికోడ్‌లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను జెమ్మా జోసెఫ్‌ కొనుగోలు చేశారని, వాయిదాల రూపంలో రూ. 46 లక్షలు చెల్లించారని తెలిపారు.

Read Also:కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఒక ఉగ్రవాది హతం

అయినప్పటికీ ఆ ఫ్లాట్‌ను బిల్డర్‌ జోసెఫ్‌కు ఇవ్వలేదు. అయితే పిటి ఉష హామీ మేరకు బిల్లర్‌కు డబ్బులిచ్చానంటూ జోసెఫ్‌ తెలిపారు. నగదు చెల్లించినా.. తన ఫ్లాట్‌ తనకు అప్పగించడం లేదని, బిల్డర్‌తో పాటు ఉష తనను మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉషతో పాటు మరో ఆరుగురిపై సెక్షన్‌ ఐపీసీ 420 కింద కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Exit mobile version