NTV Telugu Site icon

Lucknow Wall Collapse: శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని ఫోన్ కాల్ రక్షించింది..

Lucknow

Lucknow

Lucknow Wall Collapse: శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గోడ కూలిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే ఈ గోడ కూలిన సమాచారం అందించింది బాధితుడేనని తెలిసింది. శిథిలాల కింద చిక్కుకున్న గోలు అనే వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. పోలీసులకు ఫోన్ చేసిన ఒక్కడే ఈ ప్రమాదంలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3.24 గంటలకు భారీ వర్షం మధ్య వచ్చిన ఫోన్‌కాల్‌లో అత్యవసర సాయం కోసం అర్థించారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 3.27 గంటలకు పోలీసు స్టేషన్, అగ్నిమాపక దళానికి సందేశం పంపబడింది. తర్వాత 15 నిమిషాల్లో, పోలీసు యంత్రాంగం నడుము లోతు నీటిలో నడుస్తూ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వెతుకుతున్నట్లు వారు తెలిపారు.

Woman Marries 5 Times: నిత్య పెళ్లికూతురు.. ఆరో పెళ్లికి రెడీ అవుతుండగా..

“పోలీస్ స్టేషన్‌కు సందేశం పంపబడిన 15 నిమిషాల తర్వాత మేము సంఘటనా స్థలానికి చేరుకున్నాము, మా మొదటి ప్రాధాన్యత, ప్రయత్నం కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించడం, అతనిని శిథిలాల నుండి బయటకు తీయడం. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసిన గోలు అనే వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసిన అనంతరం అతనిని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ (సివిల్) ఆసుపత్రికి పంపారు. ” అని ఏసీపీ అనూప్‌ కుమార్‌ సింగ్ వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని గోడను క్రమంగా పగులగొట్టి శిథిలాలను తొలగించారు. దీంతో మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీశారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఉదయం 9.30 గంటల వరకు కొనసాగింది.