Electricity Bill: నార్మల్ గా అందరికి వచ్చే కరెంట్ బిల్లు కంటే కొంచెం పెరిగినా హడావుడి పడుతాం.. ఏకంగా కోట్లలో వచ్చిన కరెంట్ బిల్లు చూసిన ఓ బిజినెస్ మ్యా్న్ కంగుతిన్నాడు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్ పూర్ జిల్లా జట్టాన్ గ్రామానికి చెందిన వ్యాపారి లలిత్ ధిమాన్‌కు ప్రతినెలా 3 రూపాయల వేల లోపు కరెంట్ బిల్లు వస్తుండేది. తాజాగా ఎలక్ట్రసిటీ అధికారులు అతడికి ఏకంగా రూ. 210,42,08,405 బిల్లును ఇవ్వడంతో షాక్ అయ్యాడు
Read Also: Justin Trudeau: కెనడా విలీనమంటూ ట్రంప్ వ్యాఖ్య.. లాస్ ఏంజిల్స్ అగ్నిప్రమాదానికి కెనడా సహాయం
దీనిపై విద్యుత్ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేయగా విద్యుత్తు బిల్లు రికార్డులను పరిశీలించిన అధికారులు సాంకేతిక లోపం వల్లే అధిక కరెంట్ బిల్లు వచ్చిందని చెప్పారు. బిల్లు రూ.210 కోట్లు కాదు.. రూ.4,047 అని సవరించటంతో లలిత్ ధిమాన్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. గతేడాది గుజరాత్‌లోని వల్సాద్ ప్రాంతంలో టైలరింగ్ షాప్ నడిపే అన్సారీకి రూ.86 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. ఇక, ఆయన అధికారులను ఆశ్రయించడంతో.. అతని దుకాణానికి చేరుకున్న డిస్కం అధికారులు మీటర్‌ను పరీక్షించి.. సాంకేతిక లోపంతో మీటర్ రీడింగ్‌కు రెండు సంఖ్యలు చేరడంతో ప్రింట్ తప్పుగా వచ్చినట్లు వెల్లడించారు.