NTV Telugu Site icon

IndiGo flight: ఇండిగో విమానంలో మహిళకు వేధింపులు.. అరెస్ట్..!

Indigo

Indigo

IndiGo flight: ఇండిగో విమానంలో మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఓ మహిళ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీ- చెన్నై ఇండిగో ఫ్లైట్ లో చోటు చేసుకుంది. విమానంలో మహిళ వెనకాల నిందితుడు కూర్చున్నాడని ఆమె కంప్లైంట్ లో చెప్పుకొచ్చింది. బాధితురాలు నిద్రపోతున్నపుడు తన వెనుక సీట్లో కూర్చున్న 43 ఏళ్ల రాజేశ్ అనే వ్యక్తి కావాలనే తన శరీరాన్ని తాకాడని ఆ మహిళ విమాన సిబ్బందికి చేసిన ఫిర్యాదులో తెలిపింది. ఇక, గురువారం సాయంత్రం 4.30 గంటలకు విమానం చెన్నైలో దిగిన తర్వాత ఆ మహిళ ఎయిర్‌లైన్ సిబ్బందిని ఈ విషయాన్ని చెరవేసింది.

Read Also: Heavy Rains: తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

కాగా, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి విమానాశ్రయ సిబ్బంది ఆ మహిళకు సహాయం చేశారు. దీంతో, మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన రాజేష్‌ శర్మ అనే వ్యక్తిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నిందితునిది రాజస్థాన్‌ అయినప్పటికీ చాలా కాలం నుంచి చెన్నైలోనే నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments