Site icon NTV Telugu

EWS reservation: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court

Supreme Court

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.. రిజర్వేషన్లు ఆర్థిక సమానత్వం కోసం కాదు, ప్రాతినిథ్యం కోసమేనని పిటిషనర్లు వాదించారు.. ఆర్థిక వెనుకబాటు తనం రిజర్వేషన్ల కల్పనకు ఆధారం కాదంటున్నారు.. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని రాజ్యాంగ సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంగించడమే అవుతుందంటున్నారు.. అయితే, సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం రిజర్వేషన్లను మించి రిజర్వేషన్లు కల్పించవచ్చనీ కేంద్ర ప్రభుత్వం వాదనగా ఉంది.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని చెబుతూ వస్తుంది..

Read Also: KTR Tweet: సూపర్‌ రామన్న హీరోలా ఉన్నావ్‌.. కేటీఆర్‌ పై నెటిజన్ల ప్రశంసలు

ఇక, ఈ వ్యవహారంలో ఇప్పటికే వాదనలు పూర్తి కాగా.. గతల నెలలో తీర్పును రిజర్వ్‌ చేసింది సుప్రీంకోర్టు.. ప్రస్తుతం చీఫ్‌ జస్టిస్‌ యూయూ లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది… ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.. 103వ రాజ్యాంగ సవరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది… ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కలిపిస్తూ చేసిన 103 వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధమైందని పేర్కొన్నారు.. రాజ్యాంగ ములాసూత్రాలను ఉల్లంఘించలేదని జస్టిస్ దినేష్ మహేశ్వరి అన్నారు… ఇక, జస్టిస్ జేకే మహేశ్వరి వ్యాఖ్యలను సమర్ధించారు జస్టిస్ బేలా త్రివేది… అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేసిన పిటిషన్లను డిస్మిస్ చేశారు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది.

Exit mobile version