NTV Telugu Site icon

Attack On Couple: దంపతులపై దుండగుల దాడి.. సాయం అడిగి చితకబాదారు

Attack On Manipur Couple

Attack On Manipur Couple

Attack On Manipur Couple: దేశ రాజధానీ ఢిల్లీలో దారుణం జరిగింది. గుర్తు తెలియన కొందరు వ్యక్తులు మణిపూర్ దంపతులపై దాడి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సాయం కావాలంటూ కోరి.. ఆపై వారిని చితకబాదిన ఘటన సౌత్‌ఈస్ట్ ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వారు ఎవరూ.. ఎందుకు దాడి చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై బాధితులు పోలిసులకు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. మణిపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో పాటు ఢిల్లీకి వలస వచ్చాడు.

సౌత్‌ఈస్ట్ ఢిల్లీలో కటుంబంతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడిని ఇంటికి విందుకు ఆహ్వానించాడు. రాత్రి కావడంతో అతడిని ఇంటి వద్ద దిగబెట్టేందుకు నడుచుకుంటూ వచ్చారు. అతడితో పాటు భార్య, చెల్లి కూడా ఉన్నారు. స్నేహితుడితో ఇంటి వద్ద దిగబెట్టిన అనంతరం తిరిగి నడుచుకుంటూ వెళుతుండగా.. వారి వద్దకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చారు. తమ ఫోన్‌ డెడ్‌ అయ్యిందని.. క్యాబ్‌ బుక్‌ చేసుకునేందుకు సాయం చేయమని ఓ వ్యక్తి కోరారు. దీనికి మణిపూర్ వ్యక్తి అంగీకరించాడు కూడా. ఎందుకో తెలియదు అకారణంగా వారు అతడి భార్య చెల్లితో అభ్యంతరకరంగా వ్యవహరించారు.

మహిళలు అని కూడా చూడకుండా వారితో దుర్భాషలాడారు. దీంతో తిరిగి వారు వాదిస్తున్న క్రమంతో మరికొందరు వారికి సాయంగా అక్కడికి వచ్చి మణిపూర్ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. మహిళలనే కనికరం కూడా లేకుండా కింద పడేస్తు గుద్దుతూ.. చావబాదారు. ఈ ఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి ఆ గుంపు పారిపోవడంతో.. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Show comments