A Girl Post On Marriage Going Viral On Social Media: కొన్ని బంధాలు ప్రేమతో కలిస్తే, మరికొన్ని బంధాల మధ్య వ్యాపార లావాదేవీలు (కట్న కానుకలు) కొనసాగుతాయి. అందుకే.. పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కొందరు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అవతల అబ్బాయి వాళ్లు కట్న కానుకలు బాగానే డిమాండ్ చేస్తే.. ఇటు అమ్మాయి తరఫు వాళ్లు అబ్బాయిల విషయంలోనూ కొన్ని లెక్కలు వేసుకుంటారు. ఉద్యోగం చేస్తున్నాడా? ఆస్తిపాస్తులేమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తారు. ఒకవేళ పెళ్లికి ముందే అబ్బాయికి ఉద్యోగం పోతే మాత్రం, పరిణామాలు మారిపోతాయి. లేనిపోని అనుమానాలు పుట్టుకొచ్చేస్తాయి. పెళ్లి చేయొచ్చా? లేదా? అనే సందేహాలు కలుగుతాయి.
Satyavathi Rathod: తెలంగాణపై కేంద్రం విషం కక్కుతోంది.. రేవంత్ నీ పార్టీని కాపాడుకో
సరిగ్గా అలాంటి సందేహమే ఓ యువతికి వచ్చింది. తాను పెళ్లి చేసుకోబోయే ఓ యువకుడికి ఉన్నపళంగా ఉద్యోగం పోవడంతో.. అతనితో ఏడడుగులు నడవాలా? వద్దా? అనే మీమాంసలో పడింది. ఇందుకు పరిష్కారం కోసం ఆన్‌లైన్‌లో నెటిజన్ల సలహా కోరింది. ‘‘మాది కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం. ఫిబ్రవరిలోనే ముహూర్తం నిర్ణయించారు. ఇంతలోనే నన్ను పెళ్లిచేసుకోయే అబ్బాయిని ‘మైక్రోసాఫ్ట్ ఇండియా’ సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగించింది. ఈ విషయం నా కుటుంబానికి కూడా తెలుసు. అయితే.. ఇప్పుడు అతడ్ని పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది నాకు తెలియడం లేదు. ఉద్యోగం చేస్తున్నప్పుడు అతని వేతనం రూ.2.5 లక్షలు ఉండేది. కానీ, ఇప్పుడు అతనికి ఉద్యోగం లేదు. నన్ను ఏం చేయమంటారు? అతడ్ని పెళ్లాడొచ్చా?’’ అని ఒక సోషల్ యాప్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇప్పుడిది వైరల్‌గా మారింది.
Nahida Quadri: యూట్యూబర్‌కి భర్త వేధింపులు.. మరొకరితో చనువుగా ఉంటూ..
ఆ అమ్మాయి పెట్టిన పోస్టుకు ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఉద్యోగం లేని వాడు ఎలా పోషిస్తాడు? అతనికంటే మంచి స్థాయిలో ఉన్న అబ్బాయి దొరుకుతాడు? అతడ్ని వదిలెయ్’’ అంటూ కొందరు ఆ అమ్మాయికి మద్దతు తెలుపుతున్నారు. ‘అయినా.. పెళ్లి బంధాలు ఇప్పుడు వ్యాపార లావాదేవీల్లా మారాయి కాబట్టి, ఆ కోణంలో ఆలోచిస్తేనే బెటర్’ అని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ యువకుడికి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగం పోతే మరో ఉద్యోగం దొరుకుతుందని, ఉద్యోగం పోయినంత మాత్రాన అబ్బాయి మరీ పనికిరాకుండా పోడని, అంత చులకన భావన ఉండకూడదంటూ అమ్మాయికి కౌంటర్లు ఇస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుందని హితవు పలుకుతున్నారు. మరి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి?