NTV Telugu Site icon

Maharashtra: తండ్రిపై కోపంతో.. మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య

Maharashtra

Maharashtra

A 15-year-old boy raped and killed a minor girl: మహరాష్ట్రలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు, మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ లో జరిగింది. బాలిక తండ్రితో రెండు రోజుల క్రితం గొడవపడినందుకు 15 ఏళ్ల బాలుడు పగ తీర్చుకునేందుకు అతని 9 ఏళ్ల కూతురును కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఆ తరువాత హత్య చేశాడు. రెసిడెన్షియల్ సొసైటీలో బాలిక మృతదేహం లభ్యం కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి తనపై దాడి చేసినందుకే ఇలా చేశానని బాలుడు పోలీసులు ముందు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Reliance Industries: భారతదేశంలో అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్.. టాప్10 కంపెనీలు ఇవే..

గురువారం తెల్లవారుజామున కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలోని కళ్యాణి వెస్ట్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ సొసైటీ ఆవరణలో బాలిక విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. 15 ఏళ్ల బాలుడిపై అనుమానం వ్యక్తం అయింది. బాలుడిని గుర్తించి, అతడిని విచారించిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని మహాత్మా ఫూలే పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

రెండు రోజుల క్రితం అమ్మాయి తండ్రితో గొడవ పడ్డానని.. అతడు తనపై దాడి చేశాడని పోలీసుకలు నిందితుడు చెప్పాడు. ఆ దాడికి ప్రతీకారంగానే బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి, బ్లేడుతో గొంతు కోశానని పోలీసులకు వెల్లడించాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసుల నమోదు చేశారు. బాలుడిని అబ్జర్వేషన్ హోమ్ కు తరలించారు. తరుపరి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments