Hajj pilgrimage: ఈ ఏడాది హజ్ యాత్రలో యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. విపరీతమైన వేడి కారణంగా వీరింతా ప్రాణాలు వదులుతున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకారం.. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1000ని దాటింది. ఎక్కువగా ఈజిప్టు దేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ దేశానికి చెందిన వారు 600కి పైగా ఉన్నారు. ఇదిలా ఉంటే హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మరణించినట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అన్ని మరణాలు కూడా ‘‘సహజ కారణాల’’ వల్లనే చోటు చేసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: Renu Desai: నేను దురదృష్టవంతురాలినా? ఆ మాట ఎంతో బాధిస్తోంది… రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
ఈ ఏడాది ఇప్పటి వరకు 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్ర కోసం సౌదీకి వెళ్లినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడికి వెళ్లిన భారతీయుల కోసం చేయగలిగిందంతా చేస్తున్నామని చెప్పింది. ఇస్లాం 5 నియమాల్లో ఒకటైన హజ్ యాత్ర కోసం యాత్రికులు సౌదీకి వెళ్తుంటారు. ఇస్లాం ప్రకారం, ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి. ఈ ఏడాది సౌదీలో వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. ఈ వారం అక్కడ ఉష్ణోగ్రత ఏకంగా 51.8 డిగ్రీలకు చేరుకుంది. తీర్థయాత్ర కోసం గంటల తరబడి ఎండలో నడవడం, ప్రార్థనలు చేయడంతో చాలా మంది అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది.