Site icon NTV Telugu

New Parliament: “900 మంది.. 10 లక్షల గంటలు”.. ఇది కొత్త పార్లమెంట్ “కార్పెట్” చరిత్ర..

Parliament Carpets

Parliament Carpets

New Parliament: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగుతోంది. కొత్త పార్లమెంట్ లో కార్పెట్ చాలా అందంగా ఉండటంతో ఇప్పుడు దానిపై చర్చ మొదలైంది. 900 మంది కార్మికులు ఏకంగా 10 లక్షల పనిగంటల పాటు నేయడం వల్ల ఈ తివాచీలు తయారయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ కళాకారులు ఈ తివాచీ తయారీలో పాలుపంచుకున్నారు. లోక్ సభ, రాజ్య సభ కార్పెట్లపై జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్ఫం కమలం బొమ్మల్ని అద్బుతంగా తీర్చిదిద్దారు.

Read Also: Russia Ukraine War: పుతిన్‌కు చెమటలు పట్టిస్తున్న ఉక్రెయిన్.. సరిహద్దులో భద్రత పెంచాలని ఆదేశం

ఈ ప్రాజెక్ట్ వెనుక 100 ఏళ్ల భారతీయ కంపెనీ ఒబీటీ కార్పెట్స్ శ్రమ ఉంది. లోక్ సభ, రాజ్యసభల విస్తీర్ణం 35,000 చదరపు అడుగులు ఉంది. ఇంతపెద్ద కార్పెట్ అల్లడం సవాల్ తో కూడుకున్న విషయం. వీటిని కుట్టడానికి ముందు సెమీ సర్కిల్ రూపంలో ఒక్కోక్కటిగా నేశారు. ఒక్కో హాల్ కోసం 17500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్పెట్లను రూపొందించారు. ఇది సవాల్ తో కూడుకున్న విషయం. ముందుగా కార్పెట్లను ముక్కలు ముక్కలుగా తయారు చేసుకుని వాటిని సరైన క్రమంలో కలపాలి. రాజ్యసభకు ఉపయోగించిన కార్పెట్ కుంకుమ్ రెడ్ కలర్ నుంచి ప్రేరణ పొందారు. లోక్ సభకు తయారు చేసిన కార్పెట్ కోసం గ్రీన్ కలర్ కార్పెట్ తయారు చేశారు. నెమలి పించం నుంచి దీనికి ప్రేరణ పొందారు.

ప్రతీ చదరపు అంగుళానికి 120 కుట్లతో ఈ కార్పెట్లను నేశారు. మొత్తం 600 మిలియన్ల అల్లికలను నేశారు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి మరియు మీర్జాపూర్ జిల్లాలకు చెందిన నేత కార్మికులు కొత్త పార్లమెంట్ భవనం ఎగువ మరియు దిగువ సభలను కార్పెట్ చేయడానికి “10 లక్షల పనిగంటలు” వెచ్చించారు. ఈ ప్రాజెక్టు కోసం 2020లో పనిని ప్రారంభించారు. అయితే కరోనా మహమ్మారి వల్ల పని ఆలస్యమైంది. సెప్టెంబర్ 2021 నాటికి పనిని ప్రారంభించారు. మే 2022లో కార్పెట్ల తయారీ పూర్తైంది. నవంబర్ 2022 నుంచి పార్లమెంట్ లో వీటిని అమర్చారు.

Exit mobile version