NTV Telugu Site icon

Food Poisoning: పెళ్లి భోజనాల్లో ఫుడ్ పాయిజనింగ్.. 80 మందికి అస్వస్థత..

Wedding Food Poisoning

Wedding Food Poisoning

Food Poisoning: పెళ్లి భోజనాలు తిన్న వారికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఈ ఘటన మహారాష్ట్రాలోని నాగ్‌పూర్‌లో జరిగింది. నగర శివార్లలోని ఓ రిసార్టులో జరిగిన పెళ్లి కార్యక్రమంలో వడ్డించిన ఆహారం తిన్న 80 మంది వ్యక్తులకు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారని, వీరింతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఈ రోజు పోలీసులు తెలిపారు.

Read Also: Man-Eating Tiger: “మ్యాన్ ఈటర్” పులి కోసం వేట.. చంపేందుకు సిద్ధమైన ప్రభుత్వం..

కైలాష్ బాత్రా అనే వ్యక్తి తన కుమారుడి వివాహం, రిసెప్షన్ వేడుక కోసం నాగ్‌పూర్ లోని అమరావతి రోడ్‌లో ఉన్న ఓ రిసార్టును రెండు రోజుల పాటు బుక్ చేసుకున్నాడు. డిసెంబర్ 10 మధ్యాహ్నం పెళ్లి కొడుకు, పలువురు అతిథులు భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు. అదే రాత్రి రిసెప్షన్ వేడుకలో వడ్డించిన ఆహారం దుర్వాసన వచ్చిందని పలువురు ఆరోపించారు. రిసార్ట్ యాజమాన్యం ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని కైలాష్ బాత్రా ఆరోపించారు.

అర్థరాత్రి సమయంలో 80 మంది అతిథులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని ఆస్పత్రిలో చేరించారు. ఆస్పత్రిలో చేరిన బాధితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. వైద్య నివేదికలు సేకరించాలరి కల్మేశ్వర్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించామని, దాని ఆధారంగా రిసార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ హర్ష్ పొద్దార్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుల్లో కొందరు ఇప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.