NTV Telugu Site icon

Johannesburg: దేశంలో సంచలనం రేపుతున్న ఘటన.. 8 మంది మోడల్స్‌ పై గ్యాంగ్‌ రేప్‌

Johannesburg

Johannesburg

దక్షిణాఫ్రికాలో 8మంది మోడల్స్‌ పై గ్యాంగ్‌ రేప్‌ దేశంలో సంచనంగా మారింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మ్యూజిక్ షూట్ కోసం వెళ్లిన 8మంది మోడల్స్‌పై దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

ఇక వివరాల్లో వెళితే..
దక్షిణాఫ్రికా రాజధాని అయిన జోహెన్సెస్‌బర్గ్‌కు పశ్చిమాన ఉన్న క్రూగెర్స్‌డార్ప్ అనే పట్టణానికి కొందరు మోడల్స్ ఓ మ్యూజిక్ షూట్ కోసం అక్కడకు వెళ్లారు. అయితే.. వీరితో పాటుగా కొందరు సహాయక సిబ్బంది సైతం షూటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లారు. ఈనేపథ్యంలో.. స్పాట్‌కు వెళ్లగానే ముందుగా వాహనం దిగిన సెట్ వేసే సిబ్బంది షూటింగ్ కోసం వచ్చిన మోడల్స్‌ను ఆయుధాలతో బెదిరించారు. మోడల్స్‌ ను బెదిరింది వారిపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు.

read also: MiG Crashes: వాయుసేకు మిగ్‌-21 గండం..! 60 ఏళ్లలో వందల ప్రమాదాలు..!

ఈ దుండగులు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే, ఒకే మహిళపై 10 మంది అత్యాచారం చేయగా, మరో మహిళపై 8మంది దారుణానికి ఒడిగట్టారు. బాధితులందరూ 18 నుండి 35 సంవత్సరాల లోపు వారే అని సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. సౌతాఫ్రికాలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై స్థానిక సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 20 మందిని నిందితులుగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలో అక్రమంగా దోపిడీ చేసే వ్యక్తులను ప్రస్తావిస్తూ, వీరంతా.. విదేశీ పౌరులుగా కనిపిస్తున్నారని.. ప్రాథమికంగా వారు జమా జమాలు” అని అన్నారు. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపడంతో దీనిపై దేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోస దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.

MiG Crashes: వాయుసేకు మిగ్‌-21 గండం..! 60 ఏళ్లలో వందల ప్రమాదాలు..!