Site icon NTV Telugu

Goa Congress: గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

Goa Congress

Goa Congress

Goa Congress: గోవాలో హస్తం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 8 మంది శాసనసభ్యులు హస్తానికి గుడ్‌బై చెప్పనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధ‌వారం నాడు బీజేపీలో చేరనున్నట్లు గోవా బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే తెలిపారు. దీనితో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం 11 నుంచి మూడుకు పడిపోనుంది. వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ ఫాల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలీక్సో సిక్వేరా & రుడాల్ఫ్ ఫెర్నాండెజ్‌లు ఉన్నారు. వారు ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ను కలిశారు.

Tamil Nadu MP Sparks Row: హిందువుగా ఉన్నంత వరకు నువ్వు శూద్రుడివే.. డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు కనిపించిన రెండు నెలల తర్వాత, అగ్రనేతలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో నేతృత్వంలోని 11 మంది ఎమ్మెల్యేలలో 8 మంది అధికార బీజేపీలో చేరనున్నట్లు పలు వర్గాలు తెలిపాయి. వారు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో పాటు విధానసభ స్పీకర్‌ను కలిశారు. 8 మంది ఎమ్మెల్యేలు ఒక గ్రూపుగా విడిపోతే – పార్టీ బలంలో మూడింట రెండొంతుల మంది, అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటును తప్పించుకోవచ్చు.ఈ ఉదయం అసెంబ్లీ సమావేశాలు జరగనందున స్పీకర్‌తో ఎమ్మెల్యేల సమావేశం ఊహాగానాలకు తావిచ్చింది. జులైలోనే ఈ ఊహాగానాలకు దిగంబర్ కామత్‌, మైఖేల్ లోబోలు కేంద్రంగా ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ స్పీకర్‌ను కోరింది.

Exit mobile version