Site icon NTV Telugu

8 Fetuses Found: 21 రోజుల నవజాత శిశువు కడుపులో 8 పిండాలు.. అరుదైన చికిత్స విజయవంతం

Jharkhand

Jharkhand

8 Fetuses Found: కడుపు నొప్పితో బాధపడుతున్న నవజాత శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పాపకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు 8 పిండాలను వెలికితీశారు. దీనితో ఆ పాప కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. అరుదైన సందర్భంలో, ఇక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ సమయంలో 21 రోజుల శిశువు కడుపులో ఎనిమిది పిండాలను కనుగొన్నట్లు వైద్యులు తెలిపారు.పిండాల పరిమాణం మూడు సెంటీమీటర్ల నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు ఉందని, అవి పొత్తికడుపులోని తిత్తిలో స్థిరపడ్డాయని శస్త్రచికిత్స చేసిన డాక్టర్ ఎండీ ఇమ్రాన్ వెల్లడించారు.

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అక్టోబర్ 10న పాప జన్మించింది. కడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, కడుపులో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. 21 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత నవంబర్​1న ముఖ్యమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద పాపకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్​ సమయంలో కడుపులో ఉన్నవి కణితలు కాదని, పిండాలు అని నిర్ధరణ కాగా.. వారు షాక్‌కు గురయ్యారు. అలా ఎనిమిది అభివృద్ధి చెందని పిండాలను వైద్యులు తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా ఫీటస్-ఇన్-ఫీటూ కేసులు 100 కంటే తక్కువ ఉంటాయని వైద్యులు చెప్పారు. అయితే.. ఆయా కేసుల్లో కడుపు నుంచి ఒక పిండాన్ని మాత్రమే తొలగించారు. ఇలాంటి కేసు బహుశా ప్రపంచంలోనే మొదటిది అయ్యుండచ్చని పాపకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు పేర్కొన్నారు.

Dmitry Medvedev: సాతానుకు వ్యతిరేకంగా రష్యా పవిత్ర యుద్ధం చేస్తోంది..

ఆపరేషన్ విజయవంతమైంది, ప్రస్తుతం శిశువు పరిస్థితి సాధారణంగా ఉంది. పాపను అబ్జర్వేషన్‌లో ఉంచామని, వారం రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు. ఇది అరుదైన కేసు కాబట్టి దీని గురించి అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించడానికి సిద్ధం చేస్తున్నామని రాంచీలోని రాణి ఆసుపత్రి అధిపతి రాజేష్‌ సింగ్‌ అన్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్ ప్రకారం, వైద్య పరిభాషలో, దీనిని ఫెటస్-ఇన్-ఫీటూ (ఎఫ్‌ఐఎఫ్) అని పిలుస్తారు.

Exit mobile version