NTV Telugu Site icon

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చిలో గుడ్‌న్యూస్.. డీఏ 4 శాతం పెరిగే ఛాన్స్..

Da Hike

Da Hike

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మార్చిలో డీఏ 4 శాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పెంపుతో డియర్ నెస్ అలవెన్స్(డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ 50 శాతానికి పెరుగుతాయి. ఇండస్ట్రియల్ లేబర్ వినియోగదారుల ధరల సూచి(CPI-IW) 12 నెలల సగటు 392.83గా ఉంది. దీని ప్రకారం చూస్తే డీఏ 50.2 శాతానికి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also: Radhika Apte: టాలీవుడ్ పై మళ్ళీ విషం కక్కిన రాధికా ఆప్టే

డీఏ, డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెంపుదల పరిమితిని అఖిల భారత CPI-IW డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తే, పెన్షనర్లకు డీఆర్ ఇస్తారు. ఈ రెండింటిని ఏడాదికి రెండుసార్లు జనవరి, జూలైలో పెంచుతారు. చివరిసారిగా అక్టోబర్ 2023లో డీఏని 4 శాతం పెంచడం ద్వారా, 46 శాతానికి చేరుకుంది. ప్రస్తుత ద్రవ్యోల్భణ రేటుని పరిగణలోకి తీసుకుంటే తదుపరి డీఏ పెంపు 4 శాతంగా అంచానా వేయబడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. డీఏ పెంపు ద్వారా వీరికి లబ్ధి చేకూరనుంది.