Site icon NTV Telugu

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెరిగిందంటే?

Govt Employees

Govt Employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూడ్ ను కేంద్రం ప్రభుత్వం చెప్పింది.. కరువు భత్యం పెంపు బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొన్నీమధ్య జీతాలను పెంచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి పెంపు పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ని ఎంత శాతం పెంచాలనేది నిర్ణయించనున్నారు. అయితే, ఇప్పటి వరకు డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపు ఉండొచ్చని ఏఐసీపీఐ గణాంకాలు చెబుతున్నాయి… ప్రస్తుతం జూలై తర్వాత డీఏ పెంచినట్లయితే, అప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 46 శాతానికి పెరగవచ్చు. ఎందుకంటే ఇది 4 శాతం డీఏ పెరుగుతుంది..

ఇకపోతే జూన్‌ కు సంబంధించిన గణాంకాలు జూలై 31 న విడుదల కానున్నాయి. ఆ తర్వాత డీఏ ఎంత శాతం పెరుగుతుందనేది మరింత స్పష్టమవుతుంది. జూలైలో 4 శాతం డీఏ పెంపు ఉంటుందని, ఆ తర్వాత ఉద్యోగుల డీఏ 46 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.. ఈ నెల ఒకటి నుంచి రెండోసారి ఢీఏ పెంపు పై కీలక ప్రకటన వచ్చేసినప్పటికి, వచ్చే ఎన్నికలకు ముందు, రక్షా బంధన్‌ నుంచి దీపావళి మధ్య ఎప్పుడైనా కరువు భత్యాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది..

అసలు జీతం ఎలా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం.. ఒక ఉద్యోగి మూల వేతనం రూ.18000 అయితే, దానిపై 42% డీఏ విధిస్తారు. అంటే డియర్‌నెస్ అలవెన్స్ రూ.7560. మరోవైపు, 46 శాతం డియర్‌నెస్ అలవెన్స్ కలిపితే, అది నెలకు రూ.8280 అవుతుంది. దీని ప్రకారం ప్రతి నెలా రూ.720 పెరుగుతుంది. అంటే ఏటా రూ.8 వేలకు పైగా పెరుగుదల ఉంటుంది.. అంటే ఉద్యోగులకు ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు జీతాలను పెంచుతున్నారు.. ఈ ఏడాది కూడా ఇది రెండోసారి జీతం పెరగనుంది.. 8 పే కమీషన్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Exit mobile version