Site icon NTV Telugu

Tragedy: 35 ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వ్యక్తి వివాహం.. పెళ్లి తర్వాత రోజే ఘోరం..

Up

Up

Uttar Pradesh: జీవిత చరమాంకంలో తనకు తోడుగా ఉంటుందని 75 ఏళ్ల సంగ్రామ్ సింగ్ అనే వృద్ధుడు, 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే, వివాహం జరిగిన తర్వాత ఉదయమే చనిపోవడం విషాదకరంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుచ్‌ముచ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Read Also: Off The Record: చిరంజీవి అవమానం విషయంలో వైసీపీ నేతల నోళ్లు అప్పుడేమయ్యాయి..?

తన మొదటి భార్య ఒక ఏడాది క్రితమే మరణించింది. అప్పటి నుంచి సంగ్రామ్ సింగ్ ఒంటరిగా నివసిస్తున్నాడు. తనకు పిల్లలు లేకపోవడంతో, వ్యవసాయం చేసుకుంటూ తనను తాను పోషించుకుంటున్నాడు. నిజానికి అతడి కుటుంబం ఆయన మరో వివాహం చేసుకోవద్దని కోరింది. కానీ వినకుండా సెప్టెంబర్ 29న, జలాల్‌పూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మన్భవతిని వివాహం చేసుకున్నాడు.

వివాహం తర్వాత, సంగ్రామ్ సింగ్ తన పిల్లల్ని బాగా చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు మన్భవతి చెప్పింది. పెళ్లి రాత్రి ఇద్దరూ ఎక్కువ సమయం మాట్లాడుకుంటూ గడిపినట్లు వెల్లడించింది. అయితే, ఉదయం నాటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తరలించేలోపే మరణించారు. ఈ ఆకస్మిక మరణం అనేక ఊహాగానాలకు తెరతీసింది. ఢిల్లీలో సంగ్రామ్ సింగ్ మేనల్లుళ్లు సహా బంధువులంతా దహన సంస్కారాలు నిలిపేశారు. పోలీసు విచారణ, పోస్టుమార్టం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version