NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీకి తిరుగులేని ఆమోదం.. 75 శాతం “అప్రూవల్ రేటింగ్” ఉన్నట్లు తాజా సర్వే..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి దేశ ప్రజల్లో తిరుగులేని ఆమోదం ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. Ipsos IndiaBus పీఎం అప్రూవల్ రేటింగ్ సర్వేలో పీఎం మోడీకి దేశవ్యాప్తంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ సర్వే ఫిబ్రవరి 2024లో జరిగింది. గతేడాది సెప్టెంబర్ నెల సర్వేతో పోలిస్తే ఆమోదం 65 శాతం నుంచి 10 శాతం పెరిగి 75 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించింది. కొన్ని నగరాల్లో మోడీ పనితీరుకు ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. మొత్తం నాలుగు జోన్ల వారీగా సర్వే జరిగింది. నార్త్ జోన్‌లో 92 శాతం, ఈస్ట్ జోన్‌లో 84 శాతం, వెస్ట్ జోన్‌లో 80 శాతం ఆమోదం ఉంది. అయితే సౌత్ జోన్‌లో అత్యల్పంగా 35 శాతం రేటింగ్ లభించింది.

టైర్-1, టైర్-3 నగరాల్లో 84, 80 శాతం ఆమోదం లభించింది. 45 ఏళ్లకు పైబడిన వారిలో 79 శాతం, 18-30 ఏళ్లు 75 శాతం రేటింగ్ ఇచ్చారు. సర్వేలో మెట్రో నగరాల్లో 64 శాతం, టైర్-2 నగరాల్లో 62 శాతం రేటింగ్ ఇచ్చారు. స్వయం ఉపాధి పొందేవారు 59 శాతం అప్రూవల్ రేటింగ్ ఇచ్చారు. సర్వే ప్రకారం, ప్రధాని మోడీ ప్రభుత్వం విద్య, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో బాగా పనిచేసిందని చెప్పారు.

Read Also: Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ ప్రేమ నాకొద్దు.. లాలూ హిందూ నిర్వచనాన్ని మరిచిపోయాడు..

అయోధ్యలో రామ మందిర నిర్మాణం నార్త్ జోన్‌లో రేటింగ్‌ని ప్రభావితం చేసిందని సర్వే సంస్థ అధికారి పారిజాత్ చక్రవర్తి అన్నారు. యూఏఈలో దేవాలయం, ఏ పాశ్చాత్య దేశ ప్రభావంతో సంబంధం లేదకుండా ప్రపంచ సమస్యలపై ఒక వైఖరి తీసుకోవడం, అంతరిక్ష ప్రయోగాలు, జీ-20 సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం, మేక్ ఇన్ ఇండియాకు పెద్ద పీట వేయడం వంటివి ప్రధాని మోడీ అప్రూవల్ రేటింగ్ పెరిగేందుకు సహకరించాయి.

వివిధ రంగాల్లో ప్రభుత్వ పనితీరు రేటింగ్ ఎలా ఉంది..?

1) విద్యా వ్యవస్థ 76%
2) పారిశుధ్యం మరియు పరిశుభ్రత 67%
3) ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ 64%
4) కాలుష్యం మరియు పర్యావరణం 56%
5) పేదరికం 45%
6) ద్రవ్యోల్బణం 44%
7) నిరుద్యోగం 43%
8) అవినీతి 42%