Eye Surgery: గ్రేటర్ నోయిడాలో ఓ వైద్యుడి నిర్లక్ష్యం బాలుడు కంటి చూపు కోల్పోయే పరిస్థితికి తీసుకువచ్చింది. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో 7 ఏళ్ల బాలుడి ఎడమ కంటికి శస్త్రచికిత్స చేసేందుకు తీసుకెళ్లగా, డాక్టర్ కుడి కంటికి ఆపరేషన్ చేశారు. నవంబర్ 12న సెక్టార్ గామా 1లోని ఆనంద్ స్పెక్ట్రమ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
Read Also: PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి డొమినికా అత్యున్నత పురస్కారం..
బాలుడి తండ్రి నితిన్ భాటి తెలిపిన వివరాల ప్రకారం.. ఎడమకంటి నుంచి తరచూ నీరు వస్తుండటంతో వారు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన డాక్టర్ ఆనంద్ వర్మ, అతడి కంటిలో ప్లాస్లిక్ లాంటి వస్తువు ఉందని ఆపరేషన్ చేయడం ద్వారా నయం చేయొచ్చని చెప్పారు. ఆపరేషన్‌కి రూ. 45000 ఖర్చు అవుతుందని చెప్పాడు.
మంగళవారం ఏడేళ్ల పిల్లాడు యుధిష్టిర్ కి ఆపరేషన్ చేశారు. బాలుడిని ఆపరేషన్ తర్వాత ఇంటికి చేర్చగా.. అతడి తల్లి వేరే కంటికి ఆపరేషన్ చేసినట్లు గుర్తించింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు డాక్టర్‌తో గొడవపడ్డారు. అయితే, ఆస్పత్రి సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించినట్లు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి తండ్రి తన ఫిర్యాదులో డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని, ఆస్పత్రికి సీల్ వేయాలని డిమాండ్ చేశారు. విచారణ ప్రారంభించామని త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.