Site icon NTV Telugu

BJP: ఏడుగురు కేంద్రమంత్రుల్ని నామినేట్ చేయని బీజేపీ.. కారణం ఇదేనా..?

Bjp

Bjp

BJP: లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో రాజ్యసభ సందడి నెలకొంది. పలువురు నాయకులు తమ పదవీ కాలం పూర్తి చేయడంతో వివిధ పార్టీల తమ అభ్యర్థులన్ని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధినేత్రి తొలిసారిగా లోక్‌సభను వీడి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి ఆమె 2024 ఎన్నికల్లో పోటీ చేయదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ నిర్ణయం చర్చనీయాంశం అయింది. ఏప్రిల్ నెలలో రాజ్యసభ పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఏడుగురు కేంద్రమంత్రుల్ని మరోసారి రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేయలేదు. అంటే దీని అర్థం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వీరిని బరిలోకి దింపేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ జాబితాలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (గుజరాత్), విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (మధ్యప్రదేశ్), ఐటి సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక) ఉన్నారు. పర్యవరణ మంత్రిగా ఉన్న భూపేందర్ యాదవ్(రాజస్థాన్), ఫిషరీ మంత్రి పురుషోత్తమ్ రూపాలా(గుజరాత్), స్మా్ల్, మీడియా ఇండస్ట్రీస్ మినిస్టర్ నారాయణ్ రాణే(మహారాష్ట్ర), విదేశాంగ సహాయమంత్రి వి మురళీధరన్(మహారాష్ట్ర) ఉన్నారు.

Read Also: Ooru Peru Bhairavakona: “ఊరు పేరు భైరవకోన”పై కోర్టు కేసు.. రిలీజ్ కి తొలగిన అడ్డంకులు

వీరందరూ కూడా రానున్న ఎంపీ ఎన్నికల బరిలో నిలవచ్చని తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రం ఒడిశాలోని సంబల్ పూర్ లేదా ధేక్నాల్ నుంచి పోటీలో ఉండే అవకాశం ఉంది. భూపేందర్ యాదవ్ రాజస్థాన్ ఆల్వార్ లేదా మహేంద్రగఢ్ నుంచి, చంద్రశేఖర్ బెంగళూర్ లోని ఏదో ఒక చోటు నుంచి, మన్సుఖ్ మాండవీయ గుజరాత్ లోని భావ్ నగర్ లేదా సూరత్ నుంచి, పురుషోత్తమ్ రూపాలా రాజ్ కోట్ నుంచి, మురళీధరన్ సొంత రాష్ట్రం కేరళ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 28 మంది రాజ్యసభ ఎంపీల్లో కేవలం నలుగురి మాత్రమే బీజేపీ రిపీట్ చేసింది. మిగిలిన 24 మంది లోక్ సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

Exit mobile version