NTV Telugu Site icon

MP: మధ్యప్రదేశ్‌లో ఘోరం.. ఇంటి గోడ కూలి ఏడుగురు మృతి

Mphouse

Mphouse

మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు కారణంగా పలు ఇళ్లు నీటిలో నానిపోయాయి. దీంతో ఒక ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.

ఇది కూడా చదవండి: Kaushik Reddy: డీసీపీ, ఏసీపీ లను సస్పెండ్ చేస్తేనే కంప్లైంట్ ఇస్తా.. కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. సంఘటనాస్థలికి స్థానిక నేతలు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: BRS Leaders: కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి.. కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం..

ఇదిలా ఉంటే కొండ ప్రాంతం కావడంతో ఇంటిపై బండరాళ్లు పడడంతో శిథిలాలను తొలగించడం కష్టసాధ్యంగా మారింది. ఒక్కొక్క బండరాయిను తొలగించారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్చలు కొనసాగుతున్నాయి. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.