భారతదేశంపై తప్పుడు ప్రచారం, వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తున్న మరో 16 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. అందులో భారత్‌కు సంబంధించిన ఏడు ఛానళ్లు, పాక్‌కు చెందిన మరో ఛానల్ ఉంది.. ఫేక్ వార్తలు, భారతదేశ వ్యతిరేక కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నందుకు గాను.. ఎనిమిది ఛానెల్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని యూట్యాబ్‌ను కోరింది భారత ప్రభుత్వం.. దీంతో, గత ఏడాది డిసెంబర్ నుండి ఇప్పటి వరకు బ్లాక్ చేసిన ఛానళ్ల సంఖ్య 102కి చేరుకుంది.
Read Also: Teachers Face Recognition App: ఫేస్ యాప్ అటెండెన్స్‌పై గందరగోళం.. రంగంలోకి మంత్రి బొత్స..
ఐటీ రూల్స్ 2021 ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించి తాజా చర్యతో ఒక ఫేస్‌బుక్ ఖాతా మరియు ప్లాట్‌ఫారమ్‌లోని రెండు పోస్ట్‌లు కూడా బ్లాక్ చేయబడ్డాయని.. భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఎనిమిది యూట్యూబ్ ఛానళ్లకు దాదాపు 86 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉండగా.. 114 కోట్ల మంది వీక్షలు ఉన్నట్టు పేర్కొంది.. ఇవి, భారతదేశంలోని మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని కేంద్రం పేర్కొంది. మతపరమైన కట్టడాలను కూల్చివేయాలని భారత ప్రభుత్వం ఆదేశించిందని.. మతపరమైన పండుగలు జరుపుకోవడంపై ఆంక్షలు పెట్టారని.. భారతదేశంలో మతంపై యుద్ం ప్రకటించారంటూ.. ఇలా నకిలీ వార్తలను ఉదాహరణగా పేర్కొంది.