Site icon NTV Telugu

టెన్షన్‌ పెడుతోన్న ఒమిక్రాన్‌.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఓవైపు కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది.. మరోవైపు.. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ టెన్షన్‌ పెడుతోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ ఇప్పటికే భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇప్పటికే 27 రాష్ట్రాలకు పాకింది.. ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు 3 వేలను దాటేశాయి.. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న ఎట్‌ రిస్క్‌ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులందరూ వారం రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 11వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ మధ్యే ఇటలీ నుంచి అమృత్‌సర్‌కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్రమత్తమైన కేంద్రం.. కొత్త నిబంధనలు విధించింది. మరోవైపు.. ఒమిక్రాన్‌ కేసులు భారీస్థాయిలో వెలుగు చూస్తుండడంతో.. ఎట్‌రిస్క్‌ దేశాల జాబితాను కూడా పెంచింది కేంద్రం.. యూకే, మిగతా యూరప్‌ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్‌వానా, చైనా, ఘనా, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా దేశాలను ఎట్‌రిస్క్‌ దేశాలుగా పేర్కొంది.

Read Also: ప్రధాని మోడీ పంజాబ్‌ టూర్‌లో భద్రతా వైఫల్యం.. 150 మందిపై కేసులు..

ఇక, కేంద్రం సవరించిన తర్వాత మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

Exit mobile version