NTV Telugu Site icon

Central Government: మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం.. వారికి స్పెషల్‌ లీవ్‌లు

Maternity Leave

Maternity Leave

మహిళా ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్ర ప్రభుత్వం… ఇప్పటి వరకు మహిళలకు ప్రసూతి సెలవులు కల్పిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు ప్రసవం సమయంలోగానీ.. లేదంటే పుట్టిన కాసేపటికే గానీ బిడ్డ చనిపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతే.. ఆ తల్లి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందువల్ల కలిగే మానసిక క్షోభను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీవోపీటీ పేర్కొంది… ఈ విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్న తరుణంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించాకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది..

Read Also: Pothina Venkata Mahesh: జనసేన నేత అరెస్ట్.. తెల్లవారుజామున 3 గంటలకు విడుదల

అయితే, ఒకవేళ సంబంధిత ఉద్యోగినికి మెటర్నీటీ లీవులు ఉంటే.. అవి వర్తింపజేయనున్నారు.. లేని ఎడల 60 రోజుల ప్రత్యేక మెటర్నిటీ లీవులు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే మరణించే పరిస్థితిని పుట్టిన 28 రోజుల వరకు నిర్వచించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం.. 28 వారాల గర్భధారణ సమయంలో లేదా దాని తర్వాత ఎటువంటి జీవిత సంకేతాలు లేకుండా జన్మించిన శిశువును ప్రసవంగా నిర్వచించవచ్చని తెలిపింది. ప్రత్యేక ప్రసూతి సెలవుల ప్రయోజనం ఇద్దరు పిల్లల కంటే తక్కువ జీవించి ఉన్న మహిళా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే మరియు అధీకృత ఆసుపత్రిలో పిల్లల ప్రసవానికి మాత్రమే అనుమతించబడుతుందని పేర్కొంది. అధీకృత ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రి లేదా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద ఎంప్యానెల్ చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రిగా నిర్వచించారు. ఎంప్యానెల్ లేని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ప్రసవాల విషయంలో, అత్యవసర ధృవీకరణ పత్రం తప్పనిసరి అని డీఓపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్ 1972లోని రూల్ 2 ప్రకారం యూనియన్ ఆఫ్ ఇండియా వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్ మరియు పోస్ట్‌లకు నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆర్డర్ జారీ చేసిన తేదీ నుండి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.