Site icon NTV Telugu

Karnataka: మతాంతర జంటపై దాడి..హోటల్ రూంలోకి ప్రవేశించి చితకబాదిన వైనం..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటకలో మతాంతర జంటలపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల బెళగావిలో ఇటీవల ఇలాగే ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతితో కలిసి ఉండగా.. మైనారిటీ వర్గానికి చెందిన 10 మందికి పైగా వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఎందుకు అమ్మాయితో కలిసి ఉన్నావంటూ ఓ గదికి తీసుకెళ్లి చితకబాదారు. ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

Read Also: Indigo Ayodhya Flight: అయోధ్యకు కొత్త విమాన సర్వీసును ప్రారంభించిన ఇండిగో.. ఛార్జీ ఎంతంటే ?

ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనే మరోసారి ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హవేరి జిల్లాలో ఒక హోటల్ గదిలో బస చేస్తున్న మతాంతర జంటను ఆరు నుంచి ఏడుగురు వ్యక్తుల బృందం తిడుతూ.. దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జనవరి 7న జరగగా.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మతాంతర జంట హోటల్ గదిని బుక్ చేసుకున్నారని సమాచారం అందుకున్న ఈ గుంపు హోటల్ లోకి చొరబడి, జంట నివసిస్తున్న గదిలోకి ప్రవేశించి దాడి చేశారు. అసభ్యపదజాలంతో తిడుతూ వారిపై దాడికి తెగబడ్డారు. వారిపై దాడి చేసిన వారు స్థానికులే అని, వారికి ఏ సంస్థతో సంబంధం లేదని హవేరి ఎస్పీ అన్షు కుమార్ చెప్పారు.

Exit mobile version