NTV Telugu Site icon

Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

Fire Accident

Fire Accident

Cylinder Blast: హర్యానాలో ఘోరం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరనించారు.పానిపట్ జిల్లా బిచ్‌పరి గ్రామ సమీపంలోని తహసీల్ క్యాంపు ప్రాంతంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ లీకేజ్ అయిన తర్వాత పేలుడు సంభవించి ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకుని మరణించారు. చనిపోయిన వారిలో దంపతులతో పాటు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.

Read Also: Pak Embassy: మహిళా ప్రొఫెసర్‌తో పాక్ ఎంబసీ అసభ్య ప్రవర్తన.. భారత్‌కు వ్యతిరేకంగా రాయాలని డిమాండ్

ఈ ఘటనలో దంపతులతో పాటు వారి నలుగురు పిల్లలు ఊపిరి ఆడకపోవడంతో మరణించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. వీరంతా పనికోసం పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి వలస వచ్చినట్లు గుర్తించారు. ముందుగా ఇంటి నుంచి పొగ రావడం గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది వెళ్లే సమయానికే కుటుంబ సభ్యులంతా కాలిపోయారు. చనిపోయిన వారిని అబ్దుల్ (45), అతని 40 ఏళ్ల భార్య, 18, 16 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు, 12, 10 ఏళ్ల ఇద్దరు కుమారులుగా గుర్తించారు.