Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నట్లు పోలీసుల వర్గాలు అనుమానిస్తున్నాయి. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దర పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు సాగర్ శర్మ, మనో రంజన్ పార్లమెంట్ హాలులో పోగ డబ్బాలను వదిలారు. దీంతో సభలోని ఎంపీలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. 2001, డిసెంబర్ 13 పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన 22 ఏళ్లు గడుస్తున్న ఇదే రోజున ఇలాంటి ఘటన జరగడం దేశాన్ని ఆందోళనకు గురిచేసింది.
Read Also: Jammu Kashmir: ఆర్టికల్ 370 తీర్పుపై “ఇస్లాం దేశాల గ్రూప్” అవాకులు.. ఘాటుగా స్పందించిన భారత్..
మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల పసుపు పొగ డబ్బాలను పేల్చారు. వీరిని అమోల్ షిండే, నీలం దేవిగా గుర్తించారు. ఐదో వ్యక్తిని లలిత్ ఝాగా పోలీసులు గుర్తించారు. ఈ ఐదుగురు ఒకే ఇంటిలో నివసించినట్లు తేలింది. ఆరో వ్యక్తికి పేరును ప్రకటించలేదు. లలిత్ ఝాతో పాటు ఆరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పార్లమెంట్ లోపల పొగ డబ్బాలను పేల్చిన సాగర్ శర్మది ఉత్తర్ ప్రదేశ్ కాగా.. మనోరంజన్‌ది కర్ణాటకలోని మైసూర్. ఇక పార్లమెంట్ వెలుపల పట్టబడ్డ నీలందేవీది హర్యానాలోని హిసార్ కాగా, అమోల్ షిండే మహారాష్ట్ర లాతూర్‌కి చెందిన వాడు. సాగర్ శర్మ, మనోరంజన్‌లకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం విజిటింగ్ పాస్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.
