Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తర్వాత 51 గంటల్లో రైల్వే ట్రాక్ ను రైల్వే శాఖ పునరుద్ధరించింది. ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొడంతో 275 మంది మరణించారు. 1200 మంది గాయపడ్డారు. బాలాసోర్ జిల్లాలో నిలిచి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ట్రైన్ బోగీలు పక్క ట్రాక్ పై ఎగిరిపడ్డాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై వస్తున్న యశ్వంత్ పూర్ ట్రైన్, కోరమాండర్ ఎక్స్ ప్రెస్ బోగీలను మరోసారి ఢీకొట్టింది. దీంతో తీవ్రస్థాయిలో ప్రాణనష్టం ఏర్పడింది. ట్రాక్ తో పాటు, ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ లైన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి ట్రాక్ ను పునరుద్ధరించారు.
Read Also: Congress: రాజస్థాన్ సంక్షోభం ముగియనే లేదు.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో విభేదాలు
ఆదివారం సాయంత్రం నాటికి ఈ మార్గంలో రైళ్లను ప్రారంభించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రమాద స్థలంలో రైళ్ల వేగాన్ని తగ్గించి, నియంత్రిత వేగంలో రైళ్లను నడుపుతున్నారు. హౌరా-పూరీల మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఒడిశా బాలాసోర్ మీదుగా సోమవారం ప్రయాణించింది. ప్రమాద స్థలంలో నెమ్మదిగా ప్రయాణించింది. మరోవైపు ఈ ప్రమాదంపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ప్రమాద సమయంలో రెండు రైళ్లు కూడా ఓవర్ స్పీడ్ తో లేవని రైల్వే శాఖ వెల్లడించింది.
#WATCH | Howrah – Puri Vande Bharat Express crosses from Odisha’s Balasore where the deadly #TrainAccident took place on June 2.
Indian Railways resumed train movement on the affected tracks within 51 hours of the accident. pic.twitter.com/myosAUgC4H
— ANI (@ANI) June 5, 2023