NTV Telugu Site icon

PM Narendra Modi: “ప్రాజెక్ట్ టైగర్‌”కి 50 ఏళ్లు.. నేడు పులుల డేటా విడుదల చేయనున్న ప్రధాని

Pm Modi

Pm Modi

50 years of Project Tiger: ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ పులుల గణన డేటాను విడుదల చేయనున్నారు. కర్ణాటకలోని చామనగర జిల్లా బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పర్యటించనున్నారు ప్రధాని. హైదరాబాద్, చెన్నై పర్యటన తర్వాత ఆయన మైసూర్ వెళ్లారు. ‘అమృత్ కాల్’ సందర్భంగా పులుల సంరక్షణ కోసం ప్రభుత్వ విధానాలను కూడా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో మైసూర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 9 వరకు పర్యాటకులను టైగర్ రిజర్వ్ లోకి అధికారులు అనుమతించడం లేదు. జాతీయ రహదారి 181పై వాహనాల రాకపోకలను మూసేశారు. ఆదివారం ఉదయం 7.15 గంటలకు బందీపూర్ టైగర్ రిజర్వ సందర్శించిన తర్వాత 11 గంటలకు పులుల డేటాను విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక నాణేన్ని విడుదల చేయనున్నారు.

Read Also: Pakistan: ప్రభుత్వం-న్యాయ వ్యవస్థ వివాదం.. చీఫ్ జస్టిస్ అధికారాల కోతపై బిల్లు.. తిప్పిపంపిన అధ్యక్షుడు..

ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబిసిఎ) ద్వారా ప్రపంచంలోని పులి, సింహం, చిరుత, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్ వంటి పులుల సంరక్షణపై దృష్టి సారించారు. బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పులుల సంరక్షణ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందితో ప్రధాని ముచ్చటించనున్నారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ముదుమలై టైగర్ రిజర్వ్ లోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు.

ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏమిటి?

ప్రాజెక్ట్ టైగర్ ను భారత్ దేశం ఏప్రిల్ 1, 1973న ప్రారంభించింది. తగ్గిపోతున్న పులుల సంఖ్య పెంచడంతో పాటు వాటిని సంరక్షించడానికి ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు దేశంలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్‌లను కలిగి ఉంది. గత 50 ఏళ్లుగా ఇండియాలో పులుల సంఖ్య క్రమంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం 75,500 చ.కి.మీ విస్తీర్ణంలో 53 టైగర్ రిజర్వులు ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశంలో 3000 పులులు ఉన్నాయి. ప్రపంచంలో పులుల జనాభాలో 70 శాతం భారత్ లోనే ఉన్నాయి. ప్రతీ ఏడాది 6 శాతం చొప్పున పులుల సంఖ్య పెరుగుతోంది. ‘ప్రాజెక్ట్ టైగర్’ స్థానిక ప్రజలకు ఏటా 45 లక్షల పనిదినాలకు పైగా ఉపాధిని కల్పిస్తుంది.